Suryaa.co.in

Andhra Pradesh

పీకే బృందం ప్రభాకర్ రెడ్డి బాగోతం జగన్ ముందుపెట్టింది

– ఆ భయంతో ఆదాలకు నిద్రపట్టడం లేదు
– ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఏ రోటికాడ ఆ పాట పాడటం ప్రభాకర్ రెడ్డికి బాగా అలవాటే
– ఎన్నికల సమయానికి సర్వేలు చేయించుకొని పార్టీలు మారడం, గెలిచాక లెక్కలేసుకొని సంపాదించుకోవడంలో అతన్ని మించినవారు లేరు
• నా ఓటమి, లోకేశ్ ఓటమిపై మాట్లాడుతున్న ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీటిక్కెట్ పై పోటీచేసి గెలుస్తానని ధైర్యంగాచెప్పగలడా?
• ప్రణబ్ ముఖర్జీ, పీ.వీ.నరసింహారావు, వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు గెలిచారు. రాజకీయమంటే గెలుపోటములుకాదు ప్రభాకర్ రెడ్డి. ప్రజలహృదయాల్లో స్థానం సంపాదించి, వారికోసం పనిచేయడం.
– ప్రజల మనసులో ఉండే నాలాంటి నాయకులకు గెలుపోటములతో సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి. వచ్చేఎన్నికల్లో నువ్వు వైసీపీటిక్కెట్ పై పోటీచేసి గెలుస్తానని ధైర్యంగా చెప్పగలవా?
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కావలి) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

“ వచ్చేఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి ఎక్కడినుంచి పోటీచేసినా ఓడిపోవడం ఖాయం. 1999కి ముందు కాంగ్రెస్ లో జనార్థన్ రెడ్డి గ్రూపులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, 1999లో తెలుగుదేశంలో చేరాడు. తరువాత 2004లో రాజశేఖర్ రెడ్డితో కాంగ్రెస్ కండువా వేయించుకున్నాడు. 2019లో వైసీపీ గూటికి చేరాడు. 2024లో మరలా పార్టీ మారితే నిజంగా ప్రభాకర్ రెడ్డి రికార్డు సృష్టించినట్టే. ఇలా అవసరాన్నిబట్టి, ఏ ఎండకు ఆ గొడుగుపట్టడం, ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడటం ప్రభాకర్ రెడ్డికి బాగా అలవాటైన విద్యే.

నా ఓటమి గురించి, లోకేశ్ ఓటమిపై మాట్లాడుతున్న ప్రభాకర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని ధైర్యంగా చెప్పగలడా? దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణ బ్ ముఖర్జీ, ప్రధానిగా చేసిన పీ.వీ.నరసింహారావు, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నెల్లూరుముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచారు? ప్రభాకర్ రెడ్డి…ఎన్నికలంటే గెలుపోటములు కాదు. ప్రజల్లో ప్రజానాయకుడిగా ఉండి, వారిమనసుల్లో స్థానం సంపాదించాలి.

నాదిఎప్పుడూ ఒకేపార్టీ.. ఒకే సిద్ధాంతం. మేం ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అయితే, నువ్వు, జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ వాళ్లు ప్రొఫెషనల్ పొలిటీషియన్స్. ఏ పార్టీ మారితే గెలుస్తాను అని సర్వేలు చేయించుకోవడం.. ఎన్నికలు దగ్గరకురాగానే జెండా మార్చడం, గెలిచాక మరలా ఎలా కోట్లుసంపాదించాలనే విషయాలు ప్రభాకర్ రెడ్డికి తెలిసినంతగా మరే నాయ కుడికి తెలియదు. ఓడిపోతే పార్టీలు, నాయకులు ఉండరంటే బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఎలాపరిపాలిస్తోంది? జనంకోసం జనంమధ్యన బతికేవారికి ఎప్పు డూ ఓటమిఉండదు ప్రభాకర్ రెడ్డి. నేనుతరిమేస్తే పార్టీనుంచి వెళ్లిపోయే వారు నాయకులు ఎలా అవుతారు ప్రభాకర్ రెడ్డి?

పీకే బృందం ప్రభాకర్ రెడ్డి బాగోతం జగన్ ముందుపెట్టింది అంటున్నారు. ఆ భయంతో ఆదాలకు నిద్రపట్టడంలేదు
లోకేశ్ తనపాదయాత్రలో వైసీపీఎమ్మెల్యేలు, మంత్రుల పాపాలచిట్టా విప్పుతు న్నాడు. ప్రభాకర్ రెడ్డిపై పీకే బృందం జగన్ కు వాస్తవాలు చెప్పడంతో అతనికి నిద్రపట్టడంలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారశైలిని తాము పట్టించుకోం. గెలిచే గుర్రాలపై ముందే బెట్టింగ్ పెట్టినట్టు, ప్రభాకర్ రెడ్డి ముందే పసిగట్టి గెలిచేపార్టీలోకి చేరుతుంటాడు. గెలవడానికి పెట్టుబడిపెట్టి, గెలిచాక దానికి పదింతలు ప్రజల నుంచి, ఇతరమార్గాల్లో వసూలుచేసుకుంటాడు. ప్రజా నాయకుల మైన మమ్మల్ని మార్చడం నీతరంకాదు ప్రభాకర్ రెడ్డి. అలానే నీ లాంటి అవకాశ వాదులు, అవినీతిపరుల్ని మార్చడం మా వల్ల కాదు.”

LEAVE A RESPONSE