Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికే పాదయాత్ర చేపట్టా!

-సక్సెస్ కి షార్ట్ కట్ లేదు…కష్టపడితేనే జీవితంలో విజయం!
-రాష్ట్రం కోసమే నా పోరాటం… లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించను
-చంద్రబాబు సిఎం అయితేనే రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుంది
-అధికారంలోకి వచ్చాక కెజి టు పిజి విద్యావ్యవస్థలో ప్రక్షాళన
-కొత్తపల్లి రచ్చబండలో యువగళం రథసారధి నారా లోకేష్

కావలి: నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్నా. అదే ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాను, జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. భయం పోవాలనే ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. మీ గళాన్ని వినిపించడానికి యువగళం ఒక వేదిక అని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ మాట్లాడారు. తొలుత కొత్తపల్లి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… సక్సెస్ కి షార్ట్ కట్ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు. కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేను.

153వ రోజు, 2 వేల కిలోమీటర్లు మైలురాయిని కూడా కావలి లోనే పూర్తి చేసుకున్నాను. నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించను. చంద్రబాబు గారు సిఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు.

జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబే!
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగనోరా వైరస్ కి చంద్రబాబు గారే వ్యాక్సిన్. బాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు. లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోయినా ఎవరికి లోటు లేకుండా పరిపాలించింది చంద్రబాబు నాయుడు. అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది యువతకు టిడిపి హయాంలో ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టగానే ప్రజలు పడిపోయారు. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు. జగన్ పాలనలోడ కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

సంక్షేమపథకాలు రద్దుచేసిన దళితద్రోహి!
పండుగ కానుకలు, విదేశీ విద్య, 27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దళితద్రోహి జగన్. బిసిలకు కుర్చీ టేబుల్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. టిడిపి హయాంలో వరి రైతులకు పెట్టుబడి రూ.20 వేలు ఉంటే జగన్ పాలనలో రూ.40 అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి రైతు సమస్యల పై అవగాహన తక్కువ. కల్తీ లిక్కర్ పై అవగాహన ఎక్కువ.

కల్తీవిత్తనాలతో నష్టపోతున్న రైతులు
జగన్ పాలనలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి హయాంలో రైతులకు రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, ఇన్పుట్  సబ్సిడీ అందించాం. జగన్ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది.

యువతకు 20లక్షల ఉద్యోగాలిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు లేని యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. జగన్ 6 లక్షల పెన్షన్లు రద్దు చేసాడు. గెలిచిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేసాడు. ఇప్పుడు కరెంట్ బిల్లుకి లింక్ పెట్టి పెన్షన్ కట్ చేస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 6 లక్షల పెన్షన్లు పునరుద్దరిస్తాం.

మహిళల కోసమే మహాశక్తి!
మహిళల సమస్యలు తెలుసుకున్న తర్వాత మహా శక్తి కార్యక్రమం ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లల కోసం ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. దీపం పథకం ద్వారా ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ పాలనలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం.

చిరుద్యోగులకు గౌరవవేతనం పెంచుతాం
మీ సేవ, అంగన్వాడీ, డ్వాక్రా యనిమేటర్లు, గోపాల మిత్రులు ఇలా అందరినీ జగన్ వేధిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనం పెంచుతాం. జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. స్కూల్స్ మూసేస్తున్నాడు. టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన కేజీ నుండి పీజీ విద్యను ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్దం చేస్తాం. అవసరమైన స్కూల్స్, పెండింగ్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం.

రచ్చబండలో కొత్తపల్లి ప్రజల అభిప్రాయాలు:
పాదయాత్ర మొదలు పెట్టిన రోజు మీ మనస్సు లో ఉన్న ఆలోచన ఎంటి? యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఎంటి అని ప్రశ్నించిన ఒక యువతి. వరి రైతులు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనరు. కొంటే డబ్బులు ఇవ్వడం లేదు. 15 ఏళ్లుగా వచ్చే పెన్షన్ జగన్ కట్ చేసాడని ఆవేదన వ్యక్తం చేసిన ఒక వృద్ధురాలు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. జగన్ పాలనలో డ్వాక్రా యానిమేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నాం. యువగళం ఏ లక్ష్యంతో చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మీరు సిఎం అవుతారా అని లోకేష్ ని ప్రశ్నించిన ఒక యువకుడు. టిడిపి హయాంలో చదువుకునే బాలికలకు సైకిల్స్ అందించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ పథకం ఆపేసింది.

LEAVE A RESPONSE