Suryaa.co.in

Family

బిందాస్‌ బతుకు బాసూ!

నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు.
నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు.
బీపీ,షుగర్ రోగాలు లేవు.
EMI లు కట్టాలనే టెన్షన్ లేదు.
అప్పులోళ్ళ గోల లేదు.
నెల జీతం కోసం వెయిటింగ్ లేదు.
రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు.
కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు.
కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు.
కార్లలో తిరగలన్నా ఆకాంక్ష లేదు.
ప్లాట్లు, భూములు కొనాలన్న ధ్యాస లేదు.
పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు లేదు.
ప్రకృతే నేస్తం పచ్చగడ్డే పట్టు పరుపు.
నేలతల్లే డబుల్ కాట్ మంచం.
పచ్చడి మెతుకులే పరమాన్నం.
తుండు గుడ్డే పట్టు వస్త్రం.
చినుకు పడితే ఆనందం.
పంట చేతికొస్తే పరమానందం.
తాను సృష్టించుకున్న సామ్రాజ్యానికి తానే రాజు, తానే మంత్రి, తానే సైన్యం.

– వెన్నెల సీత

LEAVE A RESPONSE