– 2019–21మధ్య 24, 557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది తిరిగొచ్చారు
– ఇంకా ఆచూకీ తేలాల్సింది 1158 కేసుల్లోనే..
– వాస్తవాలు ఇలా ఉంటే, వేలు, లక్షలు అంటూ కాకి లెక్కలు
– ఎన్సీఆర్బీ గణాంకాల్ని బాబు, లోకేశ్, పవన్ లు వక్రీకరిస్తున్నారు
– చంద్రబాబు దుశ్శాసునుల పాలనలో దుర్మార్గాలెన్నో..
– కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి.. ఘటనల్ని మహిళలు ఎన్నటికీ మరువరు
– తమ స్వార్ధరాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టే నీచుడు బాబు
– వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత
మహిళల్ని అడ్డంపెట్టి బాబు నీచ రాజకీయం
మొదట్నుంచి మహిళల్ని అడ్డంపెట్టుకుని స్వార్ధ, నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యిగా చెప్పుకోవచ్చు. ఆనాడు లక్ష్మీపార్వతి ని అడ్డంపెట్టుకుని ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడం, తద్వారా ఆయన్నుంచి పార్టీని.. అధికార కుర్చీని లాక్కున్న నీచుడు ఈ చంద్రబాబు. అదేవిధంగా సొంత భార్య భువనేశ్వరి గారిని కూడా తెరమీదికి తెచ్చి తన స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు ఈ చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను.
భువనేశ్వరి ని ఎవరూ పల్లెత్తు మాట కూడా అనకుండానే.. ఏవేవో అన్నట్లు చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడ్చి సానుభూతికి పాకులాడిన సంగతి పప్పు లోకేశ్‌కు అవగాహన కావాలి. రాజకీయాల్లో ఏమాత్రం పరిజ్ఞానంలేని లోకేశ్ ఈరోజు మరలా తన తల్లిని ఎవరో తిట్టారని చెప్పుకోవడం సిగ్గుచేటు.
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
నోటికొచ్చింది మాట్లాడి లేనిది ఉన్నట్లు .. ఉన్నది లేనట్లు ప్రచారం చేసే చంద్రబాబు మాదిరిగానే ఆ పార్టీ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మహిళల అదృశ్యాలపై మాట్లాడుతూ పూర్తిగా అవాస్తవాల్ని వివరించారు. ఆమె ఆరోపణల్ని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలుగా నేను ఈరోజు ఖండిస్తున్నాను. అనిత అన్నం తిని మాట్లాడిందా..? లేదంటే, గడ్డి తిన్న మాటల్ని ప్రెస్మీట్లో చెప్పిందా..?
మహిళల అదృశ్యంపై ఎన్సీఆర్బీ గణాంకాల్ని చదువుకుని అర్ధం చేసుకుని ఉంటే అనిత అలా మాట్లాడి ఉండేదికాదు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే మహిళలతో పాటు ఆ పార్టీలో పనిచేసే మహిళా కార్యకర్తలకే రక్షణ లేదని అనిత అర్ధం చేసుకోవాలి. మా నాయకుడు జగన్‌గారిపై, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈసారి నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాను.
మహిళా అదృశ్యం కేసులు 1158 మాత్రమే
-2019లో 6,896 మిస్సింగ్ కేసులు నమోదైతే, అందులో 6,583 కేసుల్లో మహిళల అచూకీని కనిపెట్టి తెచ్చారు. అదే 2020లో 7,576 మిస్సింగ్ కేసులు నమోదైతే, వాటిల్లో 7,195 కేసుల్లో బాధితుల్ని గుర్తించి పోలీసులు రక్షించారు. 2021ల్లో 10వేలు మిస్సింగ్ కేసులు నమోదు కాగా అందులో 9,621 కేసుల ఆచూకీ లభించింది. ఆ నివేదిక ప్రకారంగా చూస్తే.. 2019 నుంచి 2021 మధ్య నమోదైన మహిళల అదృశ్యం కేసులు 24, 557 ఉంటే.. వాటిల్లో 23,399 కేసుల్ని గుర్తించి బాధిత మహిళలకు పోలీసులు భద్రత కల్పించారు. అంటే, ఈ మూడేళ్లలో 1158 కేసుల్లో మాత్రమే మహిళల ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు.
చంద్రబాబు దుశ్శాసునుల పాలనలో దుర్మార్గాలెన్నో..
టీడీపీ మహిళల్ని వంచించిన పార్టీ. ధుర్యోధన, దుశ్శాసునుల పార్టీ అది. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి అనే విదార్థిని, ఒక ప్రొఫెసర్ కులోన్మాదానికి బలైతే దాన్ని ర్యాగింగ్బూతంగా బాబు చిత్రీకరించాడు. అప్పట్లో మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు అంతేలేదు. ఆయన హయాంలో మహిళల వేధింపుల్లో రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉండగా, మహిళల అక్రమరవాణాలో రెండోస్థానంలో ఉంది. ఆనాడు టీడీపీ ముసుగులో ఉన్న కీచకులు, దుశ్శాసునులు చాలామంది అరాచకపర్వం నడిపారు.
కనుకనే, ఆ ప్రభుత్వం పట్ల విసిగివేసారిన మహిళలు 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి బాబుకు తగిన బుద్ధి చెప్పారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన ఆయన పార్టీ ఎమ్మెల్యేలే విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నడిపి వార్తల్లోకెక్కగా.. దెందులూరు ఎమ్మెమల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా తహశీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టాడు. దీనిపై అప్పట్లో వనజాక్షి గారు సీఎం కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. తిరిగి ఆమెనే బాబు మందలించి పంపిన ఘటన అందరికీ తెలిసిందే కదా..? ఈ ఉదంతాన్ని మహిళలెలా మరిచిపోతారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన వారి అరాచకపర్వం చెప్పాలంటే అంతాఇంతా కాదు.
బాబు, కొడుకు తేనె పలుకులను మహిళలు నమ్మరు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు మహిళల పుట్టుకనే అవమానించాడు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా..?’ అని మాట్లాడిన దుర్మార్గుడు చంద్రబాబు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఒకవైపు అలాఉంటే, మరోవైపు మహిళా సోదరీమణులను చంద్రబాబు మోసం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. డ్వాక్రా రుణాలపై వడ్డీని, అసలును కూడా తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని చంద్రబాబు హామీనిచ్చాడు.
ముఖ్యమంత్రి కాగానే తానిచ్చిన మాటను దాటేసి.. రుణమాఫీ చేయలేని మహిళాద్రోహి చంద్రబాబు. ఈ విషయంపై రాష్ట్రంలోని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇప్పటికీ తిట్టుకున్నారని లోకేశ్ తన యాత్ర ద్వారా గుర్తించాలని మనవి చేస్తున్నాను. మహిళల్ని ఉద్దరిస్తామని బాబు, లోకేశ్‌లు తేనెపలుకులు పలికినంత మాత్రాన ఎవరూ నమ్మరు గాక నమ్మరు. లేనిపోని అభూతకల్పనల్ని అల్లి పచ్చమీడియాలో విషపురాతలు రాయించి.. వాటిపై మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధిచెబుతారు.
రాజకీయ ఉన్మాది పవన్‌కళ్యాణ్
మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్ మహిళల మిస్సింగ్, వాలంటీర్లే కారణం అంటూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయనొక పొలిటికల్ టూరిస్ట్. ప్యాకేజీ తీసుకున్నాననే ఉన్మాదంతో మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఆరోపించినంత మాత్రాన ఆయన మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెబుతున్నాను.
మహిళా పక్షపాతి జగన్
ఇచ్చిన మాటకు కట్టుబడటమనేది రాజకీయాల్లో ఒక్క జగన్గారిలోనే చూస్తాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఈరోజు మహిళలు ఆకాశంలో సగం.. అవనిలో సగంలా అన్నిరంగాల్లోనూ ముందంజలోనే ఉన్నారు. జగన్ గారు మహిళలకు ఒక అన్నగా, తమ్ముడిగా కొండంత అండనిచ్చి ధైర్యమిచ్చిన ముఖ్యమంత్రి అని రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆదరణ పొందుతున్నారు.
డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా మహిళా సోదరీమణులకు సుమారు రూ.3.5 లక్షల కోట్ల లబ్ధిని నేరుగా అందించారు. అదేవిధంగా నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లోనూ 55 శాతం మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.
ఒక్క ఆసరా పథకం ద్వారానే రూ.24వేల కోట్లు చెల్లించిన మహిళా పక్షపాతి మా జగన్ నిలిచారు. జగన్ ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఈ చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ యాత్రల పేరిట విమర్శలకు పాల్పడుతున్నారు. మరోవైపు పచ్చమీడియాలో విషపురాతలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మహిళల్లో ఈ ప్రభుత్వానికి ఉన్న మంచిపేరును చెరిపేయలేరని గుర్తుచేస్తున్నాను.
జగనన్న అంటే ఒక నమ్మకం, ధైర్యంః
దేశానికే రోల్‌మోడల్‌గా ఉండే విద్యా విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. ఈరోజు మహిళారక్షణకు సంబంధించి దిశయాప్‌ను 1.40 కోట్లమంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కడైనా అఘాయిత్యం చోటుచేసుకున్న క్షణాల్లోనే దిశయాప్‌తో బాధితులు రక్షణ పొందుతున్న సంఘటనల్ని అనేకం చూస్తున్నాం. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండువేల జనాభా ఉన్న ప్రతీచోట మహిళా పోలీసులును నియమించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే అందిస్తున్నాం. జగనన్న అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. అందుకే, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలు, మేధావులంతా జగన్‌గారి వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024లో 175 స్థానాలకు 175 స్థానాలూ వైఎస్ఆర్సీపీకి ఇచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.