2012-13 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు రు.15,31,453 కోట్ల మొండి బాకీలను బ్యాంకులు రద్దు చేశాయని, సమాచార హక్కు చట్టం క్రింద ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నదని వార్త ప్రచురించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రు.2,09,144 కోట్ల రద్దు చేశాయట.
ఇది మొండి బాకీల రద్దుకాదని, రుణాల పుస్తకాల నుండి తొలగించి, బ్యాంకుల లాభ – నష్టాల ఖాతా(బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్)ను శుభ్రపరచుకొని, తద్వారా పన్నుల భారం నుండి తప్పించుకోవడానికి ఉద్దేశించిన ఒక ప్రక్రియగా ఒక వాదనను ముందుకు తీసుకొచ్చి బుకాయిస్తుంటారు. నిజమే, సాంకేతికంగా చూస్తే రద్దు కాదు. అలా పుస్తకాల నుండి తొలగించినప్పటికీ మొండి బాకీలను వసూలు చేసుకొనే హక్కును బ్యాంకులు వదులుకోని మాట వాస్తవమే. కానీ, అనుభవం ఏం తెలియజేస్తున్నది.
మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, అంటే, 2014-15 నుండి 2022-23 వరకు తొమ్మిదేళ్ళ కాలంలో బ్యాంకులు రద్దు చేసిన మొండి బాకీలు రు.14,56,226 కోట్లు.
2017-18 నుండి 2022-23 సంవత్సరాల మధ్య రు.12,18,654 కోట్లు రద్దు చేసి, రు.1,77,584 (14.57%) కోట్లు మాత్రమే రద్దు చేసిన మొండి బాకీలు వసూలు చేశారు.
రెండవసారి అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లలో రద్దు చేసిన రు.5,86,891 కోట్ల (2021-22లో రు.1,74,966 కోట్లు, 2020-21లో రు.2,02,781 కోట్లు, 2022-23లో రు.2,09,144 కోట్లు)లో రు.1,09,186(18.6%) కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయని వెల్లడించింది.

సామాజిక ఉద్యమకారుడు