-చంద్రబాబు నాయుడుకు శిష్యుడిని కాదు..సహచరుడిని
-1996లో 610జీవోను, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్
-చర్చకు సిద్ధం.. నువ్వు వస్తావో,కేటీఆర్ ను పంపుతావో.. హరీష్ ను పంపుతావో తేల్చుకో
-కిషన్ రెడ్డీ.. 2011లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంది నిజం కాదా?
-టీఆర్ఎస్ కు 25కు మించి సీట్లు రావు
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్.ఆయన మరణ వార్త తెలిసినా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదు.కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీని చిల్లర మల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు.ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంతో ప్రభుత్వం విఫలమైంది.కాంగ్రెస్ ను కేసీఆర్, కేటీఆర్ అభ్యంతరకరంగా దూషించారు.
తండ్రీ కొడుకులు చర్చను రేవంత్ రెడ్డి చుట్టూనే తిప్పారు.సభలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు.టీడీపీలో నేను చంద్రబాబు నాయుడుకు శిష్యుడిని కాదు..సహచరుడిని.ఎమ్మెల్సీగా గెలిచాకే నేను టీడీపీలో చేరాను.కానీ టీడీపీలో కేసీఆర్ ప్రస్థానం చంద్రబాబు అనుచరుడిగా మొదలైంది.
నిలువ నీడ లేని కేసీఆర్ కు టీడీపీనే ఆధారమైంది.తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదు. తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో ముందున్నా.కానీ కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారు.1996లో 610జీవోను, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్.1996 లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని కేటీఆర్ కు సూచిస్తున్నా.
సోనియా వల్లే తెలంగాణ సాకారమైందని 13 జూన్ 2014లో శాసనసభలో కేసీఆర్ చెప్పారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారు?తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నది, నిలదీసింది నేను.చంద్రబాబు సహచరుడుగా ఉన్నా ఆనాడు తెలంగాణపై నా నిబద్ధత మారలేదు.ఆనాడు గవర్నర్ పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యాను.
24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించా.హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పా.అప్పర్ సీలేరు, లోయర్ సెలేరులో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని చెప్పా.ఎవరికి తలవంచకుండా తెలంగాణ కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను నేను.కేసీఆర్ నిన్ను నమ్మి వచ్చిన వారిని మోసం చేసిన సంగతి మరిచిపోయావా?కేసీఆర్ నీ పార్టీ బతుకిందే కాంగ్రెస్ తో…కాంగ్రెస్ లేకపోతే నువ్వు, నీ కుటుంబం అడుక్కు తినేవారు.
24 సంవత్సరాల నా రాజకీయ ప్రస్తానంలో ఏనాడు నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలనపై మాత్రమే నేను విమర్శలు చేశా. కేసీఆర్ తన అవసరానికి ఒకసారి, టీడీపీ, మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.సన్నాయి నొక్కులు నొక్కుతున్న కిషన్ రెడ్డీ.. 2011లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంది నిజం కాదా?శాసన మండలి ఎన్నికల్లో ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నది నిజం కాదా?
ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను ఇవాళ కేసీర్ అక్కున చేర్చుకున్నారు.సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన జగన్ కు ప్రగతి భవన్ పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్.తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ దుర్మార్గుడు.లాలూచీలో కేసీఆర్ ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరు.మీరా తెలంగాణపై నా నిబద్దత గురించి మాట్లాడేది?2014 కు పూర్వం మేం ఏం మాట్లాడినా తెలంగాణ కోసమే మాట్లాడాం..
నన్ను తెలంగాణ వ్యతిరేకి అంటే తెలంగాణ సమాజం నమ్మదు.ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్.గద్దర్ 2019మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలిగద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారు..యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని నాకు సూచించారు..
కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారు.గద్దర్ మరణించారని ఇప్పటివరకు నేను సంయమనం పాటించా..ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు.. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడ్డారు.గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే నేను విజ్ఞత ప్రదర్శించా.. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని కేసీర్ ను హెచ్చరిస్తున్నా.
నేను లేవనెత్తిన అంశాలపై, తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం.. నువ్వు వస్తావో,కేటీఆర్ ను పంపుతావో.. హరీష్ ను పంపుతావో తేల్చుకో.. టీఆర్ఎస్ కు 25కు మించి సీట్లు రావు.. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు.