Suryaa.co.in

Telangana

రేవంత్ ధ్యాస అంతా బ్లాక్ మెయిలింగ్ మీదే

-తెలంగాణ ఉద్యమంలో ద్రోహి పాత్ర ,తుపాకీ రాముడి పాత్ర కోవర్టు పాత్ర పోషించింది రేవంతే
-పీసీసీ అంటేనే ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్
-మూడు నెలల్లో ప్రజలు రేవంత్ కు పిండం పెడతారు
-రేవంత్ ఓ కలెక్షన్ కింగ్
-మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

రేవంత్ రెడ్డి కండ్లు నెత్తి కెక్కి పొగరు తో మాట్లాడుతున్నారు. తండ్రి వయసు లో ఉండే కేసీఆర్ పై మాట్లాడే స్థాయా రేవంత్ ది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోలికా? నాగలోకానికి నక్కకు పోలికా? గద్దర్ అందరి వాడు ..అన్ని పార్టీ లతో ఉద్యమం లో పాల్గొన్నాడు. గద్దర్ పై కాల్పులకు అప్పటి చంద్రబాబు కారణం కాదా? గద్దర్ జై తెలంగాణ అనగానే కాల్పులు జరిగాయి.

కాంగ్రెస్ హాయం లో నక్సలైట్లను చర్చలకు పిలిచి తర్వాత వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేసే రేవంత్ ఎత్తుగడలు పారలేదు.రేవంత్ ఆద్వర్యం లో పీసీసీ పెమెంట్స్ కలెక్షన్ సెంటర్ గా మారింది. తెలంగాణ ఉద్యమం లో ద్రోహి పాత్ర ,తుపాకీ రాముడి పాత్ర కోవర్టు పాత్ర పోషించింది రేవంతే. చంద్రబాబు సహచరుడినన్నావ్ ..చంద్రబాబు తెలంగాణ ద్రొహే . ఆయన సహచరుడిగా నువ్వు తెలంగాణ ద్రోహివే.

రేవంత్ ధ్యాస అంతా బ్లాక్ మెయిలింగ్ మీదే. rti ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించావ్ ..అందుకే rti తెచ్చిన సోనియా గాంధీ పార్టీ లో చేరావు. సోనియా ను దయ్యం భూతం అన్నావ్ ..తర్వాత కాంగ్రెస్ లో చేరావ్.కేసీఆర్ కు పిండం పెడతావా ? రేవంత్ కు కాంగ్రెస్ కార్యకర్తలే పిండం పెడతారు.

కాంగ్రెస్ లో హేమాహేమీలు ఉన్నారు. రేవంత్ లాంటి చీటర్ లను వాళ్ళు ఎలా భరిస్తున్నారో. పీసీసీ అంటేనే ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్ అయ్యింది.దేశంలో ఇలాంటి నీచమైన పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా?మోడీ ని ఒక్క మాట అంటేనే రాహుల్ కు కోర్టు శిక్ష విధించింది. రేవంత్ అనే చిల్లర మాటలకు కోర్టు ఎన్ని సార్లు శిక్షలు వేయాలో. రేవంత్ కాంగ్రెస్ లో కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఎవరు పోరాడారో ప్రపంచానికి తెలుసు.

రేవంత్ రెడ్డి బీసీ కులాలు ,తక్కువ సంఖ్య ఉన్న కులాలను అవమాన పరుస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చెడ్డి గ్యాంగ్ సంస్కృతిని పెంచి సమాజం మీద ఉసి గొల్పుతున్నారు. మూడు నెలల్లో ప్రజలు రేవంత్ కు పిండం పెడతారు భరతం పడతారు. కాంగ్రెస్ అధికారం లోకి రాదని రేవంత్ కు తెలుసు అందుకే కలెక్షన్ల మీద పడ్డారు.

రేవంత్ ఓ కలెక్షన్ కింగ్. రేవంత్ తనకు తాను రాజుగా భావించుకుంటూ అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని రోజుల్లోనే కుంపట్లు సిగపట్లు మొదలయ్యాయి. కేసీఆర్ తెలంగాణ బీద వర్గాలకు దేవుడు. తెలంగాణ లో అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర పన్నుతున్నారు.కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ట్రిక్కులు చేసినా వంద సీట్ల తో బీ ఆర్ ఎస్ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయం. రేవంత్ లాంటొని చేతిలో తెలంగాణ పడితే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని తెలంగాణ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు.

కేంద్రం లో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే : ఎమ్మెల్యే ఏ .వెంకటేశ్వర్ రెడ్డి
రేవంత్ రెడ్డి ని పీసీసీ అధ్యక్షుడిగా చేయగానే తెలంగాణ లో కాంగ్రెస్ పని ఖతమైంది.కేసీఆర్ అంతటి పెద్ద మనిషి కి పిండం పెడతా నంటావా ..ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా? కేసీఆర్ ను తిడితే కాంగ్రెస్ కు ఓట్లు పడతాయా? రేవంత్ హాయం లో కాంగ్రెస్ సీట్లు 6 నుంచి 3 కు తగ్గుతాయి? కేసీఆర్ దగ్గర తెలంగాణ విజన్ ఉంది ..మీకు ఏముంది? ఈ పక్కన కేసీఆర్ ఉన్నాడు ఆ పక్కన ఎవరు ఉన్నారు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? కేసీఆర్ ను తిడితే రేవంత్ రెడ్డి భజన పరులు చప్పట్లు కొడతారు తప్ప సాధారణ జనం హర్షించరు. కేసీఆర్ ను తిడితే తెలంగాణ గుండెలు మండుతాయి.

కాంగ్రెస్సే రేవంత్ కు పిండం పెట్టడం ఖాయం: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య …
పిండాలు ఎపుడు పెడతారో తన కుటుంబం లో రేవంత్ ఎవరినైనా అడిగితే తెలుస్తుంది.కాంగ్రెస్ ను రేవంత్ భ్రష్టు పట్టించారు.హైకమాండ్ కూడా రేవంత్ పై సీరియస్ గా ఉంది. రేవంత్ కు కాంగ్రెస్ యే పిండం పెడుతుంది.కెసిఆర్ ktr హాయం లో తెలంగాణ ప్రతిష్ట దేశ విదేశాల్లో పెరిగింది. రేవంత్ నోటిని అదుపులో పెట్టుకోవాలి.

LEAVE A RESPONSE