-వైకాపా నేతల నేరాల్లో పోలీసులు ఎందుకు భాగస్వామ్యం అవుతున్నారు?
-జగన్ మోహన్ రెడ్డిలా చంద్రబాబు నాయుడిది నేరచరిత్ర కాదు
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మతిలేని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షనేతపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఘటన 4 వతేది జరిగితే 8 వ తేదిన ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తారా? నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత కేసు పెట్టిన ఈ ప్రభుత్వం మతిలేని ప్రభుత్వం కాదా? జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యురిటీ, ఎన్.ఎస్.జీ రక్షణ వలయం, వందలాది పోలీసులు సమక్షంలో ప్రతిపక్షనేత హత్యాయత్నం చేశాడా? ఏసెయ్యండ్రా… అని అన్నాడని చంద్రబాబుపై కేసు పెట్టారు.
‘చంద్రబాబు నాయుడును కాల్చి చంపండి’ ‘బాబును బంగాళాఖాతంలో కలిపినా తప్పులేదు’, ‘రాళ్లతో కొట్టండి’, ‘జైళ్లో పెట్టి తన్నాలి’ అన్న జగన్ వ్యాఖ్యలను ఏమంటారో డీజీపీ చెప్పాలి. ఇన్ని మాటలు మాట్లాడిన జగన్‌పై ఎన్ని 307 కేసులు పెట్టాలి? జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిలు ఏది చెబితే అది చేయడమే పోలీసుల పనా?
అలిపిరి బాంబు బ్లాస్ట్ కేసులో నిందితుడు, ఎర్రచందనం స్మగ్లర్ అయిన కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిధున్ రెడ్డి ఎందుకు వెళ్లాడు? జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి నేరాలలో పోలీసులు ఎందుకు భాగస్తులవుతున్నారు.? 4 గంటలకు ఘటన జరిగితే 5 గంటలకు ఘటనా స్థలానికి వచ్చిన చంద్రబాబు నాయుడిపై ఏ విధంగా 307 పెడతారు? జగన్ రెడ్డికి పోలీసులు ఎందుకు దాసోహమవుతున్నారు.?
వీ-కోటలో ఉన్న రంగనాధ్ అనే టిడిపి నేతను కేసులో ఎలా ముద్దాయిగా చేర్చారు?. కుట్రదారులు చెబితే రంగనాధ్ ఎక్కడున్నా పర్లేదు కేసు పెడుతాం అన్నట్లు పోలీసుల చర్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం ప్రభుత్వ పిచ్చికి పరాకాష్ట. జగన్ మోహన్ రెడ్డిలా ….చంద్రబాబు నాయుడిది నేరచరిత్ర కాదు. పోలీసులు ఇకనైనా ధర్మంగా, చట్టబద్దంగా వ్యవహరించాలని కోరుతున్నా.
చంద్రబాబుపై దాడి చేస్తున్న వైకాపా గూండాలను ఎదుర్కొన్న మొలకలచెరువు సర్కిల్ ఇన్పెక్టర్ సాదిక్ అలిని వీర్‌కు పంపడం దుర్మార్గం, బుద్దిలేని చర్య. సాధిక్ అలి బదిలీని ఉపసంహరించుకోవాలి. చెంచలగూడ జైల్లో ఉన్న జగన్ రెడ్డి చంద్రబాబును కూడా జైలుకు పంపాలన్న కల కలగానే మిగిలిపోతుంది.
వైసీపీ ప్రభుత్వం మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నది. చంద్రబాబు టూర్ లో ఉన్నానని చెబుతున్న వైసీపీ నేత ఉమాపతిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. వైసీపీ నాయకుల నేరాల్లో పోలీసులు కుట్రదారులు కావద్దు. సాగునీటి ప్రాజెక్టులు కోసం చంద్రబాబునాయుడు యాత్ర చేపట్టారు. పోలీసులపై దాడి చేయడానికి కాదు.