-రూ. 40 కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన సొంతానికి వాడుకుంది జగన్ రెడ్డే
-ఆధారాలుతో డిబేట్కు వచ్చే ధైర్యం వైసీపీకి ఉందా?
-శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ
విశాఖలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు, గీతం యూనివర్సిటీ యాజమాన్యం 40 ఎకరాల తప్పుడు భూములను ఆక్రమించుకున్నట్లు రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకోవడం వైసీపీ నాయకత్వానికి స్వాభావికంతో వచ్చిన దోపిడీ అలవాటు. ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించుకుని ఎస్టేజ్ నిర్మించుకుంది మీరు కాదా?
రూ.40 కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి తన సొంత ఇంటికి ఏ విధంగా వాడుకున్నాడో మేం ఆధారాలతో వస్తాం…డిబేట్ కు వచ్చే ధైర్యం వైసీపీ ఉందా? గుడ్డ కాల్చి ఎదుటివారిపై వేయడం వైసీపీ నేతలకు అలవాటు. అదే రీతిలో రోజా మాట్లాడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలనుకుంటే మీ బండారమే బయటపడుతుంది.
జగన్ రెడ్డి సొంత ఇళ్లకి ప్రభుత్వ ధనం రూ.40 కోట్లు ఖర్చు
క్ర.సం జీవో నెం. తేదీ శాఖ వివరాలు మొత్తం (రూ. లక్షల్లో)
1 ఆర్.టి..132 25.06.19 ఆర్&బి తాడేపల్లిలోని తన ఇంటికి రోడ్ల విస్తరణ కోసం 500.00
2 ఆర్.టి.నం.133 26.06.19 ఆర్&బి తాడేపల్లిలోని నివాసం కోసం హెలిప్యాడ్, ఫెన్సింగ్, బారికేడ్లు, మరుగుదోడ్లు, సెక్యూరిటీ గార్డుల కోసం 189.50
3 ఆర్.టి.నం.146 12.07.19 ఆర్&బి తాడేపల్లి నివాసం కోసం ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్స్ కోసం 3.63
4 ఆర్.టి.నం.160 22.07.19 ఆర్&బి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద సీసీ కెమెరాలు, బ్యాగేజీ స్కానర్ల కోసం 24.50
5 ఆర్.టి.నం.139 09.07.19 ఆర్&బి తాడేపల్లిలోని జగన్ నివాసానికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం 8.50
6 ఆర్.టి.నం.254 04.10.19 ఆర్&బి తాడేపల్లిలోని జగన్ నివాసానికి పీవీసీ రైన్ ఫ్రూఫ్ పగోడాస్ , మొబైల్ టాయిలెట్స్, కూలర్ల కోసం 22.50
7 ఆర్.టి.నం.259 15.10.19 ఆర్&బి తాడేపల్లి నివాసానికి అల్యూమినియం విండోలు, డోర్ల కోసం 73.00
8 ఆర్.టి.నం.306 25.11.19 ఆర్&బి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఇంటి ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం 35.50
9 ఆర్.టి.నం.307 25.11.19 ఆర్&బి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం సంవత్సరపు ఖర్చుల కోసం 120.00
10 ఆర్.టి.నం.308 25.11.19 ఆర్&బి తాడేపల్లిలోని జగన్ నివాసం ఫర్నిచర్ కోసం 39.00
11 ఆర్.టి.నం.366 23.12.19 టూరిజం ఇడుపులపాయ సమాధిని టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి 2707.00
12 ఆర్.టి.నం.279 31.10.19 ఆర్&బి తాడేపల్లి సి.ఎం క్యాంపు కార్యాలయానికి దక్షిణం వైపు 0.148 ఎకరాల భూ కొనుగోలు కోసం. 325.00
మొత్తం 40.48 కోట్లు