Suryaa.co.in

Telangana

హైదరాబాద్ గౌడ హాస్టల్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని నాగోల్ లో శుభం కన్వెన్షన్ హాల్లో జరిగిన హైదరాబాద్ గౌడ హాస్టల్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నూతన కమిటీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ నూతన అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ లింగం గౌడ్, ఉపాధ్యక్షులు అయిలీ వెంకన్న గౌడ్, కార్యవర్గ సభ్యులు బైరు భాస్కర్ గౌడ్, సోమ శైలజ గౌడ్ ఎం అశోక్ గౌడ్, డాక్టర్ ఆర్ స్వప్న గౌడ్, సిద్దు గౌడ్, డాక్టర్ హరికుమార్ గౌడ్, ఎలికట్టే విజయకుమార్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్ రాజు గౌడ్ అశోక్ గౌడ్ పి లక్ష్మణ్ గౌడ్ వెంకట నర్సాగౌడ్ బసవరాజ్ గౌడ్, విక్రమ్ గౌడ్ తదితర కార్యవర్గ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారాన్ని చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్, పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, చంద్రయ్య గౌడ్, రాష్ట్ర పబ్లిక్ ప్రాస్కూటర్స్ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, గణేష్ గౌడ్ , లక్ష్మణ్ గౌడ్, తదితర గౌడ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE