Suryaa.co.in

Telangana

రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు పక్కా

– బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగార్
– అవినీతి పార్టీలైన బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పతనం ఖాయం
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
– నారాయణఖేడ్ లో వారం పాటు జరగనున్న ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న విజయ పాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతి, అరాచకాలు పెచ్చు మీ, మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయ పతనం ఖాయమని కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగార్ అన్నారు. భారతదేశానికి అద్భుత పాలన అందిస్తూ చిన్న అవినీతి కూడా లేకుండా మచ్చలేని నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రపంచంలోనే పేరు గాంచారని ఆయన వివరించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ గారి నేతృత్వంలో నారాయణఖేడ్ లో కూడా బిజెపి గెలుపు పక్కా అని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి మచ్చలేని పార్టీ అని, దేశ భవిష్యత్తు బిజెపి మీదనే ఆధారపడి ఉందని, అదేవిధంగా తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల వరకు నారాయణఖేడ్ లోనే ఉండి నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కేడర్ ను సమాయత్తం చేస్తానని ఆయన చెప్పారు.

ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటిస్తున్న హామీలన్నీ ఉట్టి నీటి మూటలే అని ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప అన్నారు.

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లాంటి అన్ని బంధులు కేవలం కేసీఆర్ జిమ్మిక్కులు అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని జాగీరుగా మార్చుకొని తమకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే కళ్యాణ లక్ష్మి, పెన్షన్ ఇస్తున్నారని ఈ అరాచకానికి త్వరలోనే కాలం చెల్ల బోతోందని సంగప్ప జోస్యం చెప్పారు.

మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మట్టి కరిపించి బిజెపి జెండా ఎగరవేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా ఏకతాటిపై ఉండి పోరాటం చేస్తే గెలుపు పక్కా ఖాయమని సంగప్ప అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాయ మాటలకు ఈసారి తెలంగాణ ప్రజలు మోస పోరని అన్నారు.

ఈ సమావేశంలో పార్లమెంట్ కన్వీనర్ రవికుమార్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, నగేష్ యాదవ్, సాయిరాం, సంజు పటేల్, మండలాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మండల పదాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE