బంగారపు గిన్ని లో,వజ్రాలు పొదిగిన స్పూన్ తో, నిత్యం పట్టు బట్టలతో , పంచభక్ష పరమాన్నాల మద్యన పెరిగిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ..
అంత ఆస్తి .. ఐశ్వర్యం.. లెగసీ ఉన్నా సరే…తనకంటూ ప్రత్యేక ముద్ర ఉంది…
స్టాన్ ఫోర్డ్ లో MBA.. వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం…అమెరికా లో లక్షరీ లైఫ్…
అన్నీ వదిలేసి తండ్రికి అండగా ఉండటానికి 2009 ఎన్నికల ముందు వచ్చాడు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కి ఇన్సూరెన్స్ అనే ప్రోగ్రాం తెచ్చి దేశం లో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీ కీ దిక్సూచి అయ్యాడు.
2014 లో పార్టీ గెలిచినా .. మంత్రి గా గొడ్డు చాకిరీ చేసి మంచి గుర్తింపు తీసుకువచ్చినా సరే…
ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయేసరికి ప్రతీ చిల్లర వెదవ తో చిల్లర మాటలు అనిపించుకున్నాడు.. అవమానాలు పొందాడు..
గోడకు కొట్టిన బంతి లాగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు..
2019 నుంచి తనకి తాను సానపెట్టుకుని మిలమిల మెరిసే వజ్రం లా తయారు అయ్యాడు.
190 రోజుల క్రితం..
తల్లీ నీ ,తండ్రీ నీ,
బంగారం లాంటి భార్య నీ,
ముద్దులొలికే బిడ్డ నీ వదిలి పెట్టి..
రాష్ట్ర భవిష్యత్ కోసం కాలికి బలపం కట్టుకుని కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా 4000 కిలో మీటర్లు టార్గెట్ పెట్టుకుని… 2500 కిలో మీటర్లు నడిచేసాడు.
ఈ వీడియో అర్ధరాత్రి 3:30 గంటలకి…
అప్పటికే 26 కిలో మీటర్లు నడిచిన తర్వాత…
అప్పటికే రోడ్డు మీద తనకోసం ఎదురు చూస్తున్న ప్రజానీకం కోసం.. అడుగు తీసి అడుగు ముందుకు వేసే ఓపిక లేకపోయినా.. భుజం నొప్పి పెట్టినా…పంటి బిగవున నడిచాడు…
పొద్దున్నే భువనేశ్వరి మేడంకి , చంద్రబాబుకి గుండె చివ్వుక్కు మని ఉంటది…కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉంటాయ్ ఈ వీడియో చూసి..
గొప్ప విషయం ఏంటంటే… లోకేష్ బాబు ఆ నొప్పి భాధ కంట్లో కనిపించలేదు..
“లోకేష్ బాబు స్థితప్రజ్ఞత కి బెజవాడ దుర్గమ్మ, బిర బిర పారే కృష్ణమ్మ సాక్ష్యం…”
నాడు దశరథ మహారాజు మాట కోసం రాముడు అడవులకి వెళ్తే…
చంద్రబాబు కోసం , తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగు ప్రజల భవిత కోసం లోకేష్ గొడ్డు చాకిరీ చేస్తున్నాడు..
నిజానికి చంద్రబాబు వల్ల లోకేష్ బాబు కి కొన్ని అవకాశాలు వచ్చాయి.. అంతకు మించి లోకేష్ కూడా చంద్రబాబు కి బలం అయ్యాడు…
చేతికి వచ్చిన కొడుకు కొండంత బలం అంటే ఇదే…
“లోకేష్ బాబు విషయంలో చంద్రబాబు నిజం గా అదృష్టవంతుడు ”
– శ్రీనివాస్