Suryaa.co.in

Andhra Pradesh

రఘువీరాకు సీడబ్ల్యుసీలో స్థానంపై ఏపీ కాంగ్రెస్‌లో సంబరాలు

– కెవిపికి కీలక పదవి ఇవ్వాలని తీర్మానం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయం ముందు రఘువీరారెడ్డి నూతన నియామకమైనటువంటి సీడబ్ల్యూసీకి ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ బీసీ నాయకులు సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, తులసీరెడ్డి . వి. గురునాధం , నరహరిశెట్టి నరసింహారావు, లాయర్ కిరణ్, భయపూడి నాగేశ్వరరావు, అల్లం రాజేష్, గౌస్, కుర్బిద, బేగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని, డప్పు వాయిద్యాలతో మారుమ్రోగించారు. ఈ సందర్భంగా కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి వదిలివెళ్లిన నాయకులందరూ కూడా పురలా కాంగ్రెస్ కు వచ్చి రాహుల్ గాంధీ, ఖర్గే ప్రవేశ పెట్టిన బీసీ డిక్లరేషన్ కు మద్దతుగా బీసీ ప్రజలను సమీకరించి, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి లాభం చేర్చాలని కోరడం జరిగింది.

ఇంత పెద్ద పదవిని ఇచ్చిన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ , ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలకు ధన్యవాదములు తెలపటం జరిగింది. అలాగే కేవీపీ రామచంద్రరావుకి సీనియర్ రాజకీయవేత్త గత ఐదున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్కు తెలుగురాష్ట్రాలలో వివిధ హోదాల్లో కాంగ్రెస్ నాయకత్వాలను బలపరచటం కోసం పనిచేస్తున్న కేవీపీ రామచంద్రరావుకి ఢిల్లీ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపునివ్వాలని ఏకగ్రీవంగా కోరడం జరిగింది.

LEAVE A RESPONSE