కొంతమంది అరాచకశక్తుల వల్ల కృష్ణాజిల్లా ప్రతిష్ట మసకబారింది
గన్నవరం ఎమ్మెల్యే జిల్లా పరువు తీస్తున్నాడు
మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్
రాష్ట్ర భవిష్యత్తుకు సక్రమమైన నాయకుడు రావాలి…కానీ జగన్ వంటి వక్రబుద్ధి కలిగిన నాయకులు రాకూడదు. కృష్ణాజిల్లా ఉన్నతమైన, నిస్వార్ధమైన నాయకులకు పెట్టిన పేరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేశారు.
నేడు కొంతమంది అరాచకశక్తుల వల్ల కృష్ణాజిల్లా ప్రతిష్ట మసకబారింది. శాసన సభను అపవిత్రం చేసిన ఎమ్మెల్యేలు కృష్ణాజిల్లాకు చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిస్వార్ధ నాయకుడు అసెంబ్లీకి వెళ్లిన గన్నవరంలో నేడు ఉన్న ఎమ్మెల్యే జిల్లా పరువు తీస్తున్నాడు.
వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుండి ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను.రాష్ట్ర భవిష్యత్తును బాగుచేయగలిగే వ్యక్తి చంద్రబాబు ఒక్కరే. రైతుల భవిష్యత్తును ముందే ఊహించి పట్టిసీమను తెచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు.