మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగువారి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు , అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చి రామ్ ప్రసాద్, పార్టీ కార్యదర్శి ఏవి రమణ, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు దారు నాయక్ పార్టీ నాయకులు కృష్ణ హసన్ భాష, పిరయ్య, అఖిల్, దయా రత్నం, సుశీల్ రావ్, సాంబిరెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ…ఎంతో త్యాగనిరతి, నిస్వార్ధమైన రాజకీయవేత్తగా, దేశ స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు.
పేద కుటుంబంలో జన్మించి అనేక కష్టాలు పడి మంచి విద్యను అభ్యసించి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తన గుండె ను చూపించి దమ్ముంటే కాల్చండి రా అని పోరాటం చేసిన యోధుడు బ్రిటిష్ వారు చేత కూడా ఆంధ్ర కేసరి అని పిలిపించుకున్న మహా నాయకుడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా మహనీయులను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేసేవారు.
ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ కనిపించడం లేదు మృగ్యం అయిపోయాయి మహనీయుల యొక్క త్యాగాలు వృధానే అన్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రం మరల టంగుటూరి ప్రకాశం పంతులుగారు కలలుగన్నటువంటి రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకు వెళ్ళేటటువంటి చంద్రబాబు నాయకత్వం తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం సమస్తమూ త్యాగం చేసిన దేశభక్తుడు… స్వాతంత్య్రం అనంతరం పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ఊపిరిగా బతికిన అసలైన ప్రజా నాయకుడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన రైతు బాంధవుడు ప్రకాశం పంతులు .ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి స్మృతికి నివాళులు.