Suryaa.co.in

Telangana

బొడ్రాయి పండుగ విజయవంతం కావడం సంతోషకరం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : లాలాపేట బొడ్రాయి, బోనాలు ఉత్సవ కమిటీ అధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సత్కార కార్యక్రమం శుక్రవారం జరిగింది. కమిటీ నేతలు వంజరి ముత్తయ్య, సునీల్ ముదిరాజ్, మురళి యాదవ్, ధనరాజ్, బాలకృష్ణ యాదవ్, మల్లికార్జున్, అనిల్ గౌడ్, అనిల్ యాదవ్, సాగర్ గౌడ్, రవి, మహేష్, బబ్బి, తదితరుల ఆద్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. వందేళ్ళకు ఓ సారి నిర్వహించే బొడ్రాయి పండుగను లాలాపేట గ్రామం ప్రజలు ఘనంగా నిర్వహించడం సంతోషకరమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బొడ్రాయి పున ప్రతిష్టించారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేలా పద్మారావు గౌడ్ సహకరించి కృషి చేశారని ఉత్సవ కమిటీ నేతలు పేర్కొన్నారు

LEAVE A RESPONSE