-బాబుకు భయం, పతనం మొదలైంది!
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటుగా మారింది. గతంలో వాలంటీర్ లపై ఆరోపణలు చేశాడు.. నేడు 50 మంది హత్యకు పథకం అంటూ ఆరోపిస్తున్నాడు. పోలీసులను ఈ అంశాల పై విచారణ చేయాల్సింది గా కోరుతాం… అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు అరెస్ట్ విషయంలో దత్తపుత్రుడు పడినంత తపన సొంత పుత్రుడు కూడా పడలేదు.
పవన్ కల్యాణ్ ది నటనా లేక మరొకటా అనేది ప్రజలకు తెలుసు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుంది… అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టిడిపి నాయకులు ఎవరూ మాట్లాడటంలేదు.
అంటున్నారు.మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల పట్టాలు పై స్టే తెచ్చారు. తన పై రాజశేఖర్ రెడ్డి గారు 26 ఎంక్వైరీలు వేశారు కానీ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అనేక సందర్భాల్లో అన్నాడు. కానీ సిఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చంద్రబాబు అవినీతి బయట పడింది. ఇప్పుడు అరెస్టు చేస్తే.. భూమి ఆకాశం ఏకమైనట్టుగా గగ్గోలు పెడుతున్నారు.
గతంలో చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకుని సిఎం వైఎస్ జగన్ ను అక్రమంగా జైలుకు పంపారు. 16 నెలలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారు… ఒక్క రోజు చంద్రబాబు జైలులో ఉంటే విలవిలలాడిపోతున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీలో గత ప్రభుత్వంలోని అనేక అంశాల్లో అవినీతి పై రిపోర్ట్ ఇచ్చాం… త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. పురంధేశ్వరి కూడా చంద్రబాబు టీమ్ లో చేరిపోయారు.
చంద్రబాబుకి భయం అంటే ఏంటో, పతనం అంటే ఎంటో సిఎం వైఎస్ జగన్ రుచి చూపించారు. దాంతో రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైంది బాబు అవినీతి వ్యవస్థను కోర్టు బోను ఎక్కించడం సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైంది.