– చంద్రబాబుకు ప్రతిఒక్కరు మద్దతుగా ఉండాలి
– మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి
ఆంధ్రదేశమే కాదు..దేశం, ప్రపంచంలో అందరూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయనకు న్యాయం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎంతో మందికి బీపీలు పెరిగి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. న్యాయవ్యవస్థలో న్యాయం లభిస్తుందని అనుకున్నాం. ఒక దోషి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది విన్నాం.
ఒక నిర్దోషిని రాజమండ్రి జైలుకు పంపడం బాధాకరం. ఇది తట్టుకోలేకపోతున్నాం. ఆయన మామూలు మనిషి కాదు.. ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఒక లెజెండ్. సంస్కారం ఉన్న వ్యక్తి. నైతిక విలువలు పాటించే వ్యక్తి. రాజకీయ చాణక్యుడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్య ఉన్నారు. పీవీ రమేష్ చెప్పినట్లుగా ఆధారాలు లేని కేసు. గవర్నర్ గారు కూడా షాక్ అయ్యారు. ఎవరి ఒత్తిడితో ఆయనను జైలుకు పంపారు. మహిళలకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అనేకమంది స్వయం శక్తితో ఎదిగేలా చేశారు.
హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించి యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అరెస్ట్ సమయంలో 73 ఏళ్ల చంద్రబాబు పట్ల అమానుషంగా ప్రవర్తించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు. రోడ్లు దారుణంగా తయారయ్యాయి. అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత ద్వారా విధ్వంస పాలన ప్రారంభమైంది. తప్పుడు కేసుల ద్వారా అనేకమందిని హింసిస్తున్నారు. యువగళం విజయవంతం కావడంతో తట్టుకోలేకపోతున్నారు.
అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రాజధానిని నాశనం చేశారు. విశాఖ రాజధాని పేరుతో అక్కడి భూములను కొల్లగొడుతున్నారు. చంద్రబాబు పర్యటనలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. ఎన్టీఆర్ వారసులు ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. భువనేశ్వరి గారు గొప్ప వ్యక్తి. ఆమె గురించి ఎన్నో మాట్లాడారు. ఆమె ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు అండగా ఉంటాం. చంద్రబాబు గారికి అందరూ మద్దతు ఇవ్వాలి. రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు నవ్వుతూ మన మధ్యకు వస్తారని ఆశిస్తున్నాం.