-ప్రజల్లో ఉన్నప్పుడే, రౌడీలు..మారణాయుధాలతో ఆయనపై దాడిచేయించిన వారు, ఇప్పుడు రక్షిస్తారంటే ఎలా నమ్మాలి?
• చంద్రబాబు భద్రతకు సంబంధించి న్యాయస్థానంలో టీడీపీ న్యాయవాదులు వేసిన పిటిషన్ ప్రకారం ప్రభుత్వం టీడీపీ అధినేతకు రక్షణ కల్పించాలి
• చంద్రబాబుకు తక్షణమే ఎన్.ఎస్.జీ భద్రత కల్పిస్తూ ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాం
• టీడీీపీ అధినేతకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు అనడానికి గతంలో వైసీపీనేతలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం
• ప్రజా నాయకుడి ప్రాణాలకు జగన్ అండ్ కో తో ముప్పు ఉంది అనడానికి గతంలో ఆయనే లక్ష్యంగా వివిధప్రాంతాల్లో జరిగిన దాడులే నిదర్శనం
• చంద్రబాబు అరెస్ట్, ఆయన భద్రతపై మొరుగుతున్న వైసీపీ పేటీఎం భౌభౌలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది
– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్
ప్రజా నాయకుడు చంద్రబాబునాయుడిని ఇబ్బంది పెడుతున్న తీరు అప్రజాస్వామిక మని, స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి గతంలో నమోదుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో చంద్రబాబు పేరు లేదు… కావాలని కక్షతో అప్పటికప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు చేర్చి, నంద్యాల వెళ్లి అర్థరాత్రి విధ్వంసం సృష్టించి, అక్కడి ప్రజల్ని భయభ్రాంతుల కు గురిచేసి మరీ అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కావాలని చేసిందేనని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ అరెస్ట్ అనంతరం చంద్రబాబుని హెలికాఫ్టర్లో తరలిస్తామన్నా ఆయన ఒప్పుకోలేదని, కావాలనే రోడ్డుమార్గంలో వెళ్లాడని కొందరు పేటీఎమ్ భౌభౌలు మాట్లాడుతున్నారు. అరెస్ట్ ఎందుకు చేశారు… అది జరిగిన విధానంపై మాట్లాడకుండా తమకు అనుకూల మైన విషయాల్ని వక్రీకరించడం జగన్ రెడ్డి పేటీఎమ్ బ్యాచ్ కు బాగా అలవాటైంది.
12 మంది ఎన్.ఎస్.జీ సిబ్బందితో ఉన్న చంద్రబాబుని నలుగురుపట్టే హెలికాఫ్టర్లో ఎలా తీసుకెళతారనే ఇంగితం వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ కు లేకపోవడం హాస్యాస్పదం. హెలికా ఫ్టర్లో రావడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని పచ్చి అబద్ధం. ఆయన భద్రతను పర్య వేక్షిస్తున్న అధికారులు, ఎన్.ఎస్.జీ సిబ్బంది చీఫ్ అందుకు ఒప్పుకోలేదు.
2015లో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో కొన్ని లక్షలమంది శిక్షణపొందితే, వేలమంది ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందారు. ఆ ప్రాజెక్ట్ కార్యకలాపాలు సక్రమంగా, సమర్థవంతంగా జరిగాయని, దాని పరిధిలో ఏర్పాటుచేసిన శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నం అందుబాటులో ఉందని, యువతశిక్షణా కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నా యని ఈ ప్రభుత్వంలోని అధికారులే ప్రశంసించారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనితీరుతో టీడీపీహాయాంలో వచ్చిన ర్యాంకులను తన హాయాంలో వచ్చినట్టు జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు
అంతకుముందే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనితీరుపై దేశవ్యాప్తంగా పరిశీలించిన ర్యాంకింగ్ సంస్థ 2016 లో ఏపీకి తొలిర్యాంక్, 2017లో రెండో ర్యాంక్, 2018లో మరలా తొలిర్యాంక్ ఇచ్చింది. 2018లో టీడీపీప్రభుత్వంలో వచ్చిన ర్యాంక్ , తన ప్రభుత్వంలో వచ్చినట్టు జగన్ రెడ్డి గొప్పులు చెప్పుకొని చప్పట్లు కొట్టించుకున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణలో ఏపీ మొదటిస్థానంలో ఉందని తెగ ప్రచారం చేసుకున్నాడు.
ఆ ప్రచా రం తర్వాత రాష్ట్రంలో ఎక్కడా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశాడు. మొత్తం ప్రాజెక్ట్ ను, దాని లక్ష్యాన్ని సర్వనాశనం చేసేశాడు. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధిపొందిన యువత నేడు చంద్రబాబునాయుడి అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే మేం ఎలా శిక్షణపొంది, మంచి ఉద్యోగాలు చేసుకుంటామని ప్రశ్నిస్తున్న యువతకు సమాధానంచెప్పే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదు.
తాను ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తిచేశారని అభినందించడానికే జగన్ రెడ్డి డీజీపీ, సజ్జల, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించాడు
లండన్ వెళ్లే ముందు చంద్రబాబునాయుడిని అడ్డుకోవడానికి ఏంచేస్తారో..ఎలాచేస్తారో చేయండని అధికారుల్ని ఆదేశించి వెళ్లిన జగన్ రెడ్డి, అక్కడినుంచి వచ్చీరాగానే డీజీపీ, సజ్జల సహా తాడేపల్లి దొంగలముఠాతో సమావేశమయ్యాడు. వారు గొప్ప ఘన కార్యం చేసినట్టు వారిని అభినందించి, తాను కూడా వికృతానందం పొందాడు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, తుఫాన్లు, అకాలవర్షాలకు సర్వంకోల్పోయి రోడ్డలపాలైనప్పుడు, పోలవరం ప్రాజెక్ట్ గోదావరి వరదకు కొట్టుకుపోయినప్పుడు, అన్నమయ్య ప్రాజెక్ట్ ఇసు కమాఫియా దోపిడీకి నీళ్లపాలైనప్పుడు ఏనాడూ ముఖ్యమంత్రి ఇంత త్వరగా స్పందించి సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. దీన్నిబట్టే జగన్ రెడ్డి ఎంతపక్కాగా, పకడ్బందీగా చంద్రబాబుని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఇరికించాడు.
చంద్రబాబుకి కట్టుదిట్టమైన భద్రత కల్పించామనడం అవాస్తవం. ప్రజల మధ్య ఉన్నప్పుడే ఆయనపై రౌడీలు, కిరాయిమూకలతో దాడులు చేయించినవారు, జైల్లో రక్షణ కల్పిస్తారా?
ప్రజల భవిష్యత్ కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలనే ఆలోచనలు ఈ ముఖ్యమం త్రి, మంత్రులు చేయరుగానీ, చంద్రబాబుని, ప్రజల్ని హింసిస్తూ, వారు బాధపడుతుంటే చూసి శునకానందం పొందడానికి మాత్రం పోటీలు పడుతుంటారు. అలాంటి ఆనందం లో భాగమే మంత్రి రోజా నిన్న చేసిన వ్యాఖ్యలు. గతంలో చంద్రబాబునాయుడు అమ రావతి వెళ్లినప్పుడు ఆయన బస్సుపై వైసీపీ మూకలతో రాళ్లు వేయించి, దాన్ని ప్రజలు వ్యక్తం చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛగా సమర్థించుకున్నారు. అది మొదలు తరువాత కూడా నందిగామలో, యర్రగొండపాలెంతో పాటు పలుప్రాంతాల్లో చంద్రబాబే లక్ష్యంగా అనేకసార్లు దాడులు, అల్లర్లకు పాల్పడ్డారు.
ఇప్పుడు మంత్రిగా ఉన్న జోగి రమేశ్ 30మంది వరకు రౌడీలను వేసుకొని చంద్రబాబుఇంటిపైకి దాడికి వెళ్తే పోలీసులు చోద్యంచ చూశారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై వైసీపీ రౌడీలు, కొందరు కిరాయి మూకలు దాడిచేసి, ధ్వంసంచేస్తే, అప్పుడుకూడా పోలీసులు జరిగే దారుణాన్ని తిలకిస్తూ ఆనందించారు తప్ప, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పుంగనూరు, అంగళ్లులో అయితే ఏకంగా టీడీపీ అధినేతపై హత్యాయత్నానికే ప్రయ త్నించారు. ఇన్ని దారుణాలు జరిగాక కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి కట్టుదిట్టమైన రక్షణ కల్పించామంటున్న మంత్రులు, వైసీపీనేతల వ్యాఖ్యల్ని నమ్మాలా?
ఆయన జనంలో ఉన్నప్పుడే దాడి చేయించిన వారు జైల్లో ఆయనపై ఈగవాలకుండా చూస్తామంటే ప్రజలు నమ్మాలా? చంద్రబాబుకి భధ్రత లేదు అనడానికి గతంలో వైసీపీనేతలు, మంత్రులు, మాజీ మంత్రులు చేసిన విపరీత వ్యాఖ్య లు కూడా ఒక నిదర్శనమే. గుడివాడ డింగ్ డాంగ్ బఫూన్, గుట్కానాని అలియాస్ కొడాలినాని ఎన్.ఎస్.జీ భద్రత లేకపోతే చంద్రబాబు అంతుచూస్తామని గతంలో అనలే దా? స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుకి ఎన్.ఎస్.జీ భద్రత అవసరంలేదని, ఆ భద్రత తొలగించాలని కోరుతూ కేంద్రానికి లేఖరాస్తానని, అది తొలగిస్తే ఆయన అంతు చూస్తామని పిచ్చిపట్టినట్టు మాట్లాడలేదా?
అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేసి, చివరకు ఈ ప్రభుత్వం అనుకున్నవిధంగానే ఆయనకు ఎన్.ఎస్.జీ భద్రత లేకుండా చేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబునాయుడి భద్రత గాల్లో దీపమేనని చెప్పక తప్పదు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైసీపీకి తొత్తుగా పనిచేస్తోంది తప్ప, ఎక్కడ ప్రజలకోసం ప్రతిపక్షా లకోసం పనిచేయడం లేదు. ఇలాంటి పోలీస్ వ్యవస్థను నమ్మి చంద్రబాబుని ఆయన మానాన ఆయన్ని వదిలేస్తామంటే టీడీపీ ఊరుకోదు.
చంద్రబాబు తరుపు న్యాయవా దులు కోరినట్టు, సీఐడీ విభాగం టీడీపీఅధినేతను అరెస్ట్ చేయడానికి 48గంటల ముందు నుంచి అరెస్ట్ చేసేవరకు వారు జరిపిన ఫోన్ కాల్ వివరాలను తక్షణమే కోర్టు ముందుంచాలి. ప్రతిపక్షనేత విషయంలో హద్దులుమీరి ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే చంద్రబాబుకి ఎన్.ఎస్.జీ భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ న్యాయవాదుల విజ్ఞప్తిని న్యాయస్థానం ఆమోదించాలి.
ఎవరిపై ఎన్నికేసులు పెట్టినా,.. టీడీపీ నేతలు, కార్యకర్తల్ని దిగ్బంధించినా జగన్ రెడ్డి తాను చేయాలనుకున్నది చేయలేడు. అతని ఆటలు ప్రజలు సాగనివ్వరు.” అని రాకేశ్ స్పష్టంచేశారు.