Suryaa.co.in

Telangana

కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల తాత్సారం

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్లు తాత్సారం చేసిన వైఖరినీ ఖండిస్తూ, బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా, వాస్తవ విషయాలు తెలియక మాట్లాడిన తీరును తేటతెల్లం చేస్తూ.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం సాయంత్రం మంత్రుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు.

అక్టోబర్ 4 న కేంద్ర క్యాబినెట్ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం కోసం నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 5(1) ప్రకారం ప్రస్తుతం.. విచారణ కొనసాగిస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అదనపు TOR ను నివేదించాలని తీసుకున్న నిర్ణయం స్వాగతించ వలసిందే. అయితే 9 ఏండ్ల కాలయాపన తర్వాత ఎన్నికల ముందు ఈ నిర్ణయం వెలువడటమే బాధాకరం. ఈ నిర్ణయం వెలువడడానికి కేంద్ర ప్రభుత్వానికి 9 ఏళ్ళు పట్టింది.

నిన్న కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వల్లనే కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఆలస్యం జరిగిందని అనడం వారు తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడమే తప్ప మరొకటి కాదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి.. వారిద్దరికీ కూడా కృష్ణా నది జలా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరాయంగా చేసిన పోరాట చరిత్ర తెలియదు. తెలంగాణకు ఇది గొప్ప విజయం. సీఎం కేసీఆర్ పట్టుబట్టి సాధించిన విజయం.

తెలంగాణ ఏర్పాటు అయిన నెల రోజులకే సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆనాటి సాగునీట శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి శ్రీ అరవింద్ రెడ్డి గారు నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 14.7.2014 న లేఖ రాశారు.

కేంద్రం ISRWD చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం. విచారణకు ఆదేశించింది. ఈ విచారణ వలన తెలంగాణకి న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సీఎం కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయన నిరంతరాయంగా ISRWD Act 1956, సెక్షన్ 3 ప్రకారం పునః పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

2018 లో ఈ విచారణను తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరారు. ఏడాది కాల పరిమితి విధిస్తూ కృష్ణా ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో.. 2015 ఆగస్టు 10 న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వంపై రిట్ పిటిషన్ ను వేసింది. అక్టోబర్ 2020 లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టారు. ఆన్ లైన్ పద్ధతిలో జరిగిన సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను.

కేసీఆర్ ఒత్తిడికి తల ఒగ్గిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్ కి రిఫర్ చేయడానికి అంగీకరించారు. అయితే కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్ వేసేందుకు హామీ ఇవ్వాలని కెసిఆర్ పట్టు బడితే, మేము న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర మంత్రి అన్నారు.

తక్షణమే ట్రిబ్యునల్ వేసి విషయంలో కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం. వలన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని న్యాయ సలహా వచ్చే దాకా వేచి చూడాలను ప్రభుత్వం నిర్ణయించింది. కాని కేంద్రం మాత్రం న్యాయ సలహాకు ఫైల్ పంపి విషయంలో తాత్సారం చేస్తూనే ఉన్నది. ఆ తాత్సారానికి తెలంగాన సుప్రీం కోర్టు కేసును కారణంగా చూపిస్తూ ఉన్నది.

కేంద్ర మంత్రి షిఖావత్ ను మరొక సారి ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన హామీ -మేరకు కెసిఆర్ కేసును విత్ డ్రా చేయాలని అధికారులను ఆదేశించినారు. కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 2021 జూన్ లో విత్ డ్రా పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టు అక్టోబర్ 2021 లో పిటిషన్ అనుమతించింది. ఆ తర్వాత 2 ఏండ్లకు ఈ నిర్ణయం వెలువడింది. పిటిషన్ విరమించుకున్న తర్వాత ట్రిబ్యునల్ కు రిఫర్ చేయడానికి 2 ఏండ్ల కాలం ఎందుకు తీసుకున్నారు. తాత్సారం ఎవరిది కిషన్ రెడ్డి గారు. ?

ఈ మధ్య కాలంలో ఎన్ని వేదికల ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసామో లెక్క లేదు. మా అధికారులు లెక్క లేనన్ని లేఖలు రాసినారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణం ఎవరు?
తెలంగాణాకు న్యాయమైన నీటి వాటా పొందడంలో కేంద్రం సహకారం శూన్యం. 2018 నుంచే మీ సాగునీటి అవసరాలు పెరిగినందు వలన కృష్ణా జలాల్లో మా వాటా తాత్కాలికంగా 50 శాతానికి చాలని కోరుతూనే ఉన్నది.

KRMB సమావేశాల్లో డిమాండ్ చేస్తూనే ఉన్నది. అయినా 50 శాతం తాత్కాలిక : వాటాను ఇవ్వలేదు. 2015 లో తాత్కాలికంగా ఒక సంవత్సరానికి అంగీకరించిన 66:34 శాతం నీటి వాటాలను ఏండ్ల తరబడి కొనసాగించడం అన్యాయం.

అదే సమయంలో సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ కు నివేదించనూ లేదు. తాము గారం చేసి, నెపం కెసిఆర్ ప్రభుత్వం మీదకు నెట్టి వేయడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తగ్గింది కాదు. వాస్తవాలు తెలియకుండా ఆయన చేసిన వ్యాఖ్యానాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికి 9 ఏండ్ల విలువైన కాలం హరించుకుపోయింది కనుక 1 లేదా 2 ఏండ్ల నిర్దిష్ట కాల పరిమితిని విధిస్తూ ట్రిబ్యునల్ కు అదనపు TOR నివేదిస్తే తెలంగాణకు కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా త్వరితగతిన దక్కుతుంది.

Justice delayed is justice denied అనేది అందరికీ తెలిసిన న్యాయ సూత్రం, తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారా త్వరితగతిన పునః పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఆశిస్తున్నాము. తెలంగాణాకు న్యాయమైన వాటా లభించేదాకా ఈ పోరాటం కొనసాగిస్తాము. తెలంగాణా ప్రయోజనాలను కాపాడి విషయంలో తెలంగాణా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి ఉత్పన్నం కాదు.

LEAVE A RESPONSE