ఎవరికి ఓటేయాలో ప్రజలు అలోచించాలి
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు
భారత రాష్ట్ర సమితిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు
ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటియంగా వాడుతున్నారు. ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడు. ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ… తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ కున్నది.
ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇయ్యలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుంది 60 ఏళ్లు అధికారంలో ఉన్న తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతగాని వాళ్ళమంటూ ఓటు అడుగుతారా?24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతార? కాంగ్రెస్ కి ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలి.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతల ఎదిగారు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. 60 ఏళ్ల పాటు ప్రజలకు ఏం చేయని కాంగ్రెస్ పార్టీని మరోసారి ఎందుకు గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జమానాలో ఉన్న కరెంటు కోతలు వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత వంటి దుర్భర పరిస్థితిలో మళ్లీ కావాలా అని ప్రశ్నించిన కేటీఆర్.
రేవంత్ రెడ్డి అన్న మూడు గంటల కరెంట్ కావాలా… లేదా 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలా తెలంగాణ రైతులు అలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం దాదాపు అన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించింది. ఒకవైపు స్కీములు తెచ్చిన టిఆర్ఎస్ ఉన్నది… మరోవైపు స్కాములు తెచ్చిన కాంగ్రెస్ ఉన్నది.
ఒకవైపు కారు ఉన్నది… మరొకవైపు బేకార్ గాల్లు ఉన్నారు. ఎవరికి ఓటేయాలో ప్రజలు అలోచించాలి. సిఆర్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచారు. కెసిఆర్ మరోసారి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నది. ఇప్పటిదాకా 33 నియోజకవర్గాల్లో తిరిగినా.. నాకు ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనింపించలేదు.ఒక్క దేవరకొండలోనే 600 కోట్లతో ఐదు లిఫ్టి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి.ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి రానున్న ప్రభుత్వంలో దేవరకొండ ప్రజలకు సాగునీరు అందించి వారి రుణం తీర్చుకుంటాం ఈరోజు ఈరోజు మిషన్. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండను పట్టించుకోలేదు.
ఈరోజు మిషన్ భగీరథ ద్వారా హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ప్రజలకు అందుతున్న నాణ్యమైన తాగునీరే దేవరకొండలోని తండాలోని గిరిజనులకు కూడా అందుతున్నది. గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగింది. ప్రత్యేకంగా తండాలను గ్రామపంచాయతీలు చేసి వేలాది మంది గిరిజనులకు రాజకీయ అవకాశాలు స్వపరిపాలన అధికారం అందించాం. సంవత్సరాల నిద్రపోయి గిరిజన యూనివర్సిటీ అంటూ బిజెపి ఎన్నికల హంగామా స్టార్ట్ చేసింది.రైతు ఆత్మహత్యలపైన అబద్ధం ఆడిన అమిత్ షాకు సవాలు విసిరిన కేటీఆర్.
కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో చెప్పిన సమాచారాన్ని కాదని కేంద్ర మంత్రి అబద్ధాలు ఆడారు.అమిత్ షా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నల్గొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్ ని తరిమి, సాగునీటి జలాలు అందించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అద్భుతమైన మందిరాన్ని పునర్ నిర్మించిన కేసీఆర్ కి ఓటేయాలా లేదా నల్గొండకి తరతరాలుగా అన్యాయం చేసిన కాంగ్రెస్ కి ఓటేయాలో ప్రజలు ఆలోచించాలి. దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , బిల్యా నాయక్ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత కావడం ఖాయం.