Suryaa.co.in

Telangana

రేవంత్ పే పట్ల జాగ్రత్త

గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్

రేవంత్ పే పట్ల జాగ్రత్త…తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుంది. ఒకప్పుడు సిద్ధాంతాలకు ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ, నేడు రాజకీయాలను వ్యాపారంగా, డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా భావించే రేవంత్ రెడ్డి చేతిలో బంధీ కావడం సిగ్గుచేటు.

రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరం. ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుని తమ సొంత పార్టీ అభర్ధులనే దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకలు, పొరపాటున అధికారంలోకి వస్తే, తెలంగాణకు ఎదురయ్యే దుష్పరిణామాలను తలుచుకుంటేనే భయమేస్తోంది. అందుకే. రేవంత్ పే పట్ల జాగ్రత్త…తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE