– తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
రాష్ట్రాన్ని వొడ్డుకు చేర్చిన సీఎం కేసీఆర్,భవితకూ కలకాలం ఎదురేలేని బంగారు బాటలేసేందుకు జన మ్యానిఫెస్టో ను ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కేసీఆర్ ప్రకటించిన బీఆర్ ఎస్ మ్యానిఫెస్టో, తెలంగాణ ప్రజలకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తే , అవకాశ వాద, అబద్దాల దెయ్యాలైన విపక్షాలకు మాత్రం హార్ట్ స్ట్రోక్ ను కలిగించిందని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ పెంపు, రైతులకు పింఛన్, రైతు బంధు పెంపు, కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా, మహిళలకు ఆర్థిక తోడ్పాటు,కౌలు రైతులకు ఆర్ధిక సహాయం, ఆసరా పింఛన్ల పెంపు తదితర అనేక మానవీయ హామీ లతో కూడిన బీఆర్ ఎస్ మ్యానిఫెస్టో రాజకీయ వ్యవస్థ లో మరో నూతన చరిత్ర కు నాంది పలికిందన్నారు.అండగా నిలిచి,అద్బుత విజయాల వైపు తెలంగాణ ను నడిపించిన సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలను జనం పెద్దాయన మాట గా గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు.
నమ్మించి ముంచే కాంగ్రెస్ ,అరుపులు తప్ప ,అర్హతనే లేని బిజెపి లు ఏ హామీలిచ్చిన ప్రజలు నమ్మకపోగా,నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. గులాబీ మ్యానిఫెస్టో ప్రకటన వెలువడగానే,దీపావళి ముందే వచ్చినంత సంబరంగా ఊరూరా పటాకుల మోత మోగిందన్నారు. డిసెంబర్ లో వెల్లడయ్యే తెలంగాణ ప్రజల తీర్పు,కేసీఆర్ ప్రభంజనాన్ని భారతదేశానికి చాటిచెప్పనుందని ఆంజనేయ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.