తెలుగుజాతి చరిత్రలో యన్టీఆర్ ప్రస్తావన లేకుండా..యన్టీఆర్ ని తలవకుండా..రాజకీయాలు ఉండవు..!
తెలుగురాష్ట్రాలు..సైబరాబాదు అభివృద్ధి లో చంద్రబాబు పాత్ర..భాగస్వామ్యం కాదనలేని..నిరూపిత సత్యం..!
ఆయన ప్రస్తావన లేని సందర్భమే ఉండదు..!
అతను ఒకే ఒక్కడు..!
ఆ ఒక్కడి చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటాయి.
కలలో ఇలలో చంద్రబాబు మీకు కొరకలేని కొయ్య..!
కంటిలోని నలుసు..చెప్పులోని రాయి..చెవిలోని జోరీగ..నరంమీద కురుపు..!
అలా మీరు భావించారు కాబట్టే..ఆయన మీద పడి..ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే బూతుల భాష..వేధింపు..వెక్కిరింత..!
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేనాటి పరిస్దితి..!
జీతాలు ఇవ్వలేని..కరెంటు కష్టాలతో..కరువు విలయతాండవం చేస్తున్నది..!
తీవ్ర వర్షా భావం..!
ముందుచూపుతో విద్యుత్ సంస్కరణలు..!ఐటీ అభివృద్ధి..రోడ్లవిస్తరణ..జన్మభూమి..!
ఈ సేవ..రైతుబజార్లు..!ఇంకుడుగుంతలు..ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా అవహేళన చేసారు..!
సాధారణంగా మార్పుని ముందు వ్యతిరేకిస్తారు..!
తర్వాత విమర్శిస్తారు..!
చివరకు ఆహ్వానిస్తారు..ఆచరిస్తారు..!
ఆయన ఆరోజు ప్రారంభించిన ఏ కార్యక్రమం అయినా పేర్లు మార్చిఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నారు..!
అందుకే ఆయన మొనగాడు…!
ఉద్యమసమయంలో..అందరి గురి తనమీద ఉన్నా..తననే లక్ష్యం చేసుకుని..!
విమర్శల దాడి చేసినా..అడుగడుగునా పర్యటనలు అడ్డుకున్నా..!నిబ్బరంగా..నిశ్చలంగా..రెండు ప్రాంతాలు రెండుకళ్ళని ప్రకటించగలిగారు..హేళన చేసిన నోళ్ళు ఇపుడు అదే మాట..అదే పాట పాడుతున్నారు..!
అందుకే ఆయన మొనగాడు…!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి ఎన్నికలలో..గణనీయమైన ఓట్లు..సీట్లు సాధించిన పార్టీ..!
గెలిచిన వారు ఒక్కొక్కరు విడిచి వెళితే స్దితప్రజ్ఞత ప్రదర్శించి..సమయం వచ్చినపుడు రాజకీయ ప్రత్యర్దుల కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు..!
అందుకే ఆయన మొనగాడు…!
ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రత్యర్దుల్ని చేరదీసి..మిత్రుల్ని విడదీసి..కాళ్ళకు కట్టెలడ్డం పెట్టినా..విసుగు విరామం లేకుండా తనపని తను చేసుకు పోయాడు చూడు..!
అందుకే ఆయన మొనగాడు…!
ఏ పేరు చెబితే ఉస్మానియా భగ్గుమంటుందో..!ఏ పేరు చెబితే ఉస్మానియా రగిలిపోతుందో..అదే ఉస్మానియా విద్యార్ధులు ఇవాళ ఆయన గురించి తలచుకుంటున్నారు..!
అందుకే ఆయన మొనగాడు…!
రైతులికి మీరు బేడీలు వేస్తే..!
ఆయన పూలదండలు వేయించుకున్నారు..గిట్టుబాటు ధరలు ప్రకటించారు..నీరిచ్చాడు..కరువుని జయించాడు..రుణమాఫీ చేసాడు..!
అందుకే ఆయన మొనగాడు..!
ఒక ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్ని సంతృప్తి పరచలేక లాఠీలు విరొగ్గట్టారు ఇతరులు..!
రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చులేకుండా..ఒక్క లాఠీ విరగకుండా..రైతుల్ని ఒప్పించి మెప్పించి ముప్పై మూడువేల ఎకరాలు సేకరించాడు..!
అందుకే ఆయన మొనగాడు..!
ఆయన మీద ఈర్ష్యా ద్వేషం పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు మీరు..!
ఆయన రాగద్వేషాలకు అతీతంగా దూషణభూషణ తిరస్కారాలకు అతీతంగా తనపని తాను చేసుకుపోయాడు..!
ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాడు..సమస్య కంటే ముందు పరిష్కారం తో ఎదురెళుతున్నాడు..ఏరోజు కూడా బాధ్యత మరచి ఇంట్లో తొంగోలేదు..ఆయనకి ప్రజలే ముందు..!
జనమూ జలమూ ఆయన బలం..!
తట్టుకోలేని మీరు ఆయన్ని అక్రమంగా నిర్భంధించి..అనారోగ్యం పాలు చేసి..మానసికంగా భౌతికంగా హింసిస్తున్నారు.
లొంగలేదు అతను..!
లొంగడు..లొంగబోడు..!
అందుకే ఆయన మొనగాడే కాదు మగాడు కూడా….!
ఆయన తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ఆదర్శవంతమైన నాయకుడు..!
చరిత్రలో నిరూపించుకున్నారు..!
భవిష్యత్తు లో నిరూపించబడుతుంది..!