Suryaa.co.in

Features

ఇజ్రాయల్-పాలస్తీనా యుద్ధమే కదా అనుకోకండి.. రేపు మనకూ ఆ పరిస్థితి వస్తే?

– రేపు భారత్-పాక్ యుద్ధం వస్తే ఎవరు ఎటువైపు ఉంటారో తెలిసిపోయింది కదా?
-హిందువులు కళ్లు తెరవాల్సిన సమయమిది

పాలస్తీనా లోని గాజువా అనే గ్రామంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులలో మరణించిన వారు అని చెప్పి కొన్ని శవాలను చూపిస్తున్నారు. దృశ్యాన్ని చూసిన ప్రపంచంలోనే మానవతావాదులు ఎవరైనా సరే.. అయ్యో ఇది దారుణం అని అనుకుంటారు.. కానీ సచ్చిన మనిషి లేదా శవాలు ఎక్కడైనా కదులుతాయా ?
చెప్పేవాడికి లేకున్నా.. కనీసం వినే వాడికి ఉండాలి లజ్జ సిగ్గు అనేది ఒక సామెత తెలుగులో ఉన్నది.
ఇది పాలస్తినాలోని హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే పాలస్తీనా ప్రభుత్వ – ప్రజల యొక్క అధిక తెలివి.  వీరికి మద్దతు ఇచ్చే ప్రపంచంలోని 57 ఇస్లామిక్ దేశాల అధిక తెలివి.

ఈ నాటకాలు ఆడే వెధవలకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్న లండన్, టర్కీ , కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ , భారత్ లోని కొన్ని రాష్ట్రాలలోని కొంత మైనారిటీ మతాలకు చెందిన వారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున పాలస్తినియాకు మద్దతు తెలుపుతూ.. ర్యాలీ నిర్వహించబోతున్న వెధవలు, మీకు సిగ్గు అనిపించడం లేదా ? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ?

మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. ఈరోజు పాలస్తినాలోని హమాస్ తీవ్రవాదులు వారి స్థావరాలను ఆసుపత్రుల కింద పాఠశాలల కింద.. మసీదుల కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ లో ఏర్పాటు చేసుకొని, ఇజ్రాయిల్ సైన్యం పైన దాడి చేసినప్పుడు, వాటి టన్నెల్ పైన ఉండే మసీదులు ఆసుపత్రులు- పాఠశాలలు రైల్వే స్టేషన్లు కూలిపోయినప్పుడు… ఇదిగో చూశారా ఇజ్రాయిల్ దేశం , పాఠశాలల పైన మసీదుల పైన సామాన్య ప్రజల పైన దాడులు చేస్తూ ఉన్నది అని.. రకరకాల వీడియోలను చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తూ వస్తున్నది.

ఒకపక్క ఇజ్రాయిల్ చెబుతూనే ఉన్నది ..ఉత్తర గాజా నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళండి మేము దాడులు చేస్తున్నాము అని. . మరి ఎందుకు వెళ్లడం లేదు ప్రజలు అక్కడి నుండి? హమాస్ తీవ్రవాదులు ప్రజలను బలవంతంగా అక్కడ ఉంచుతున్నట్లు తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా నిన్న రాత్రి దాదాపుగా 90 మంది ప్రజలు గాజా వీడి వెళుతుంటే, హమాసు తీవ్రవాదులు వారిని అడ్డుకొని కాల్చిపారేశారు.  మీరు చస్తే ఇక్కడ ఇజ్రాయిల్ సైన్యం చేతిలో సచ్చి స్వర్గానికి వెళ్ళండి. లేదంటే మా చేతిలో కుక్క చావు చావండి అని బెదిరించి చంపినట్లు ,దానికి సంబంధించిన వార్తలు బయటకు వెలువడ్డాయి.

ఇన్ని నాటకాలు ఆడుతున్న హమాస్ తీవ్రవాదులకు ఎందుకు మద్దతిస్తున్నారు ఈ వెధవలు? మహాభారత యుద్ధంలో మహామహులు కూడా మరణించారు ఎందుకయ్యా అంటే.. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు, భీష్ముడు లాంటి పెద్దలు కూడా నోరు మెదపలేదు కాబట్టి. వారందరూ ఒక్కొక్కరుగా నేలకొరిగారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.. ఎక్కడైతే అధర్మాన్ని ఇది అధర్మం అని చెప్పలేదో.. ఒక సామెత ఉన్నది లక్ష మంది దుష్టుల కన్నా ఒక మేధావి మౌనం చాలా భయంకరమైనది అని.

ఈరోజు భారతదేశంలోని ప్రతి హిందువు ఈ అధర్మాన్ని ఖండించకుంటే, రేపటి నాడు ఇదే ఆపద మన ఇంటి తలుపుతడుతుంది. దానికి ఉదాహరణ తాజాగా ఇంటలిజెన్స్ వర్గాలు, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.  ఈరోజు పాలస్తినా ఉగ్రవాదులు ఏ విధంగానైతే.. ఇజ్రాయిల్ పైన దాడులు చేసి 1500 మంది సాధారణ ఇజ్రాయిల్ మహిళలు వృద్ధులు పిల్లలను అతికిరాతకంగా హత్య చేసి, దాదాపుగా 250 మంది విదేశీయులను బందీలుగా చేసుకుని తిరిగి గాజాలోకి ఎలా అపహరించారో.. అదేవిధంగా భారత్ పైన కూడా, పాకిస్తాన్ దేశానికి చెందిన తీవ్రవాదులు దాడి చేయబోతున్నట్లు నివేదికలు అందించారు.

కాకపోతే మీరు అనుకోవచ్చు .. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము కదా ఇక్కడ దాకా రారులే అని మీరు అనుకోవచ్చు.. కానీ వారి అనుబంధ సంస్థలు. మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన హైదరాబాదు నగరంలోని మన హైదరాబాద్ చుట్టుపక్కలోని ఉన్నట్లు ఎన్ని దాడులు జరగలేదు? ఎంత మందిని అరెస్టు చేయలేదు మన స్థానిక ప్రభుత్వ పోలీస్ అధికారులు.. కేంద్ర ఎన్ ఐ ఏ అధికారులు? సమయం వచ్చినప్పుడు వీరందరూ బయటికి వస్తారు.  కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రపంచం ఎటు పోతుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.

లేచామా తిన్నామా పడుకున్నావా అని కాదు. రేపు నీ భవిష్యత్తు తరాలకు, నీవు ఇచ్చే భరోసా ఏమిటి అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి. ఈరోజు పాలస్తీనా హమాస్ తీవ్రవాదులకు- ఇజ్రాయిల్ కు మధ్య యుద్ధం జరిగితే, ప్రపంచంలోనే ఇస్లామిక్ ప్రజలందరూ కూడా పాలస్తినాకు మద్దతు ఇచ్చారు. ఇదే యుద్ధం రేపు భారత్ పాకిస్తాన్ దేశానికి వస్తే.. ప్రపంచంలోని ఇస్లాం ప్రజలందరూ కూడా, పాకిస్థాన్ కు మద్దతు ఇస్తారు. మరి నీ భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి ఎవరున్నారు ?

కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచం ఎటు పోతుందో కాస్త చూసుకోండి. తక్షణ మీ కర్తవ్యం ఏమిటో ఆలోచించుకోండి .

– భరత్

LEAVE A RESPONSE