ఒక జనరేషన్ క్రితం దీపావళి రోజు సాయంత్రానికి చాలా కుటుంబాల్లో పిల్లల ముఖాల్లో ఒక ఆత్రుత…మా నాన్న…. దీపావళి మందులు తెస్తాడా? తెస్తే ఎన్ని తెస్తాడు?
ఒక రకమైన టెన్షన్….. అంతలో….ఊర్లో ఎక్కడో పెద్దపెద్ద అవుట్లు పేలుస్తున్న శబ్దం వినపడటం….ఏదో బాధ…అంతలోనే సంతోషం…..
ఈలోపు పక్కింట్లో నో…నాలుగైదు ఇళ్ల తర్వాతో….పిల్లలు బయటికి వచ్చిపండగ మొదలుపెడతారు. కాసేపటికి నాన్న వస్తాడు. కోరుకున్నట్టు టపాసులు తెస్తే…పట్టలేని సంతోషం. దీపాలతో పాటు పిల్లల ముఖాలు కూడా వెలిగిపోయేవి.
ఒక రకంగా ….పిల్లలు తల్లిదండ్రుల వెంటపడేవాళ్లు…పండగ చేయమని.
కట్ చేస్తే……
ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం రకరకాల టపాసులు తీసుకొస్తున్నారు. వందలు కాదు వేలు ఖర్చు పెడుతున్నారు.
కానీ ప్రస్తుత జీవన విధానం ఫలితంగా పిల్లలకు పండుగల పై అవగాహన, ఆసక్తి రెండు లేవు.
తల్లిదండ్రులే పిల్లలను బతిమిలాడుతున్నారు…ఫోను పక్కన పెట్టి టపాసులు కాల్చమని. టీవీ ఆపేసి పండుగలో పాల్గొనమని. కానీ పిల్లలు మాత్రం ఫోను ప్రపంచంలో నుంచి బయటికి రావటం లేదు.
సారాంశం ఏంటంటే….
ఒకప్పుడు పండగలు ఉన్నాయి….కానీ డబ్బులు లేవు.
ఇప్పుడు డబ్బులు ఉన్నాయి…
కానీ పండగ లేదు.
కొలికపూడి శ్రీనివాసరావు