-మోపిదేవి లేఅవుట్ 3 లో దారి లేక అవస్థలు పడుతున్న యానాదులు
-ఎస్టి యానాదుల అవస్థలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా
-మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్
మోపిదేవి లేఔట్ 3 లో ఎస్ టి యానాదులకు కేటాయించిన జగనన్న కాలనీ, నివేశన స్థలాలలో ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ చెప్పారు.
మోపిదేవి నుండి రావారిపాలెం వెళ్లే ఎస్టీ లేఔట్ ను గోవర్ధన్ పరిశీలించారు. ఎస్టీలకు కేటాయించాల్సిన నివేశన స్థలాల్లో ఇతర సామాజిక వర్గాలకు కేటాయించడంతో వారు లేఔట్ స్థలాన్ని ఇరువైపులా ఆక్రమించుకొని రహదారి కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ఎస్టి యానాదులు గోవర్ధన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యత లోపంతో గృహాలు అసంపూర్తిగా నిర్మించి వదిలేశారని, గోడలు ప్లాస్టింగ్ చేయకుండా కింద ఫ్లోరింగ్ చేయకపోవడంతో పడుకోవడానికి కూడా వీలు లేకుండా రాళ్లు గుచ్చుకుంటున్నట్లు ఎస్టీలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి స్థలాలు కేటాయించగా అధికారులు నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ వారు వాపోయారు.
జగనన్న కాలనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు సేంటున్నర చొప్పున స్థలం కేటాయించాల్సి ఉండగా పట్టా మాత్రం సెంటున్నరకు స్ధలం సెంటు కేటాయించారని అన్నారు. ఇతర సామాజిక వర్గాలకు రెవెన్యూ అధికారులు వేలం ద్వారా విక్రయాలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ఎస్టీలు ఆరోపించారు. ఇంటిలో నుండి బయటకు రావాలన్న రెండు మీటర్ల డ్రైన్ గోతిలో నుండి రాకపోకలు సాగిస్తున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
నాగరికత తెలియని ఎస్టీలకు మరుగు దొడ్లు రోడ్డు లేని లేఅవుట్ కేటాయించి ఇబ్బందులకు గురిచేయడం పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు గోవర్ధన్ చెప్పారు. ఎస్సీ ఎస్టీల హక్కులకు భంగం కలిగితే న్యాయ పోరాడటానికి సిద్ధమని గోవర్ధన్ చెప్పారు.
ఇప్పటికే ఎస్టీ లేఔట్ లో జరిగిన ఆక్రమణలు ,అక్రమాలపై సోషల్ మీడియాలో అనేక పర్యాయాలు కథనాలు హల్చల్ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటంటు ప్రశ్నించారు. జగనన్న లేఔట్ లపై గ్రామపంచాయతీ, మండల పరిషత్ , రెవిన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా వారి అండదండలతోనే లేవట్ లలో ఆక్రమణలు పెరగటం, గృహ నిర్మాణాల్లో అవకతవకలు జరగటంపై ఎస్టీలతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.