భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే.. జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యుడవుతాడు
• దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనం
• మంత్రి రాంబాబు స్వామిమాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ.. మీసాలు తిప్పుతున్నాడు
• చంద్రబాబుకేసుల్లో వాదనలు వినిపించడానికి వందలకోట్లు ఇచ్చి మరీ ఢిల్లీ లాయర్లను పిలిపించిన జగన్ రెడ్డికి… ఏపీకి రావాల్సిన కృష్ణాజలాలపై వాదనలు వినిపించడానికి మాత్రం తీరికలేదు
• వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఖర్చుపెట్టామంటున్న రూ.25వేల కోట్లలో రూ.10 వేలకోట్లు జీతభత్యాలకు పోతే.. 15వేలకోట్లు తన మంత్రులు.. తన బినామీల కంపెనీలకు జగన్ రెడ్డి దోచిపెట్టాడు
• తన స్వప్రయోజనాలకోసం రాష్ట్ర రైతాంగాన్ని బలిచేసిన జగన్ రెడ్డి.. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి.. తమ్ముడు అవినాశ్ రెడ్డిని బాబాయ్ హత్యకేసు నుంచి కాపాడటానికి రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాల్ని పొరుగురాష్ట్రానికి ధారాధత్తం చేశాడు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన జగన్ రెడ్డి, తన అసమర్థత ..చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్తనాటకాలు మొదలెట్టి, చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నాడని, కృష్ణాజలాలతో ఏ జిల్లాలో ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుందో కూడా తెలియని… కే.ఆర్.ఎం.బీ కార్యాలయాన్ని సముద్రం పక్కన విశాఖపట్నంలో పెడతానన్న తెలివితక్కువ ముఖ్యమంత్రి పాలనలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం రాష్ట్ర రైతాంగానికి ఏ కోశానా లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఒక దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనం
“ ఒక దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే, ఏపీ పోలీస్ యంత్రాంగమే ముద్దాయిగా మారింది. చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ స్వామి మాలలో ఉన్నామనే ఇంగితం మరిచి మంత్రి రాంబాబు అబద్ధాలు చెబుతూ..మీసాలు తిప్పుతున్నాడు. చంద్రబాబు తన హయాంలో కేఆర్ఎంబీతో ఎలాంటి వివాదాలు లేకుండా రాష్ట్రానికి రావాల్సిన నీటిని సాధించాడనే వాస్తవాన్ని ఈ సన్నాసులు తెలుసుకోవాలి. టీడీపీహాయాంలో ఏ సంవత్సరం… ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంతెంత నీరు ఇచ్చామనే వివరాల్ని తాము ఆధాారాలతొ ప్రజల ముందు ఉంచుతాం.
జగన్ రెడ్డికి.. మంత్రి రాంబాబుకి దమ్ము, ధైర్యముంటే సాగునీటి కేటాయింపులు.. ఇరిగేషన్ రంగానికి నాలుగేళ్లలో చేసిన బడ్జెట్ కేటాయింపులు.. పెట్టిన ఖర్చు..పూర్తైన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో శ్వేతపత్రం విడుదల చేయగల రా? కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించ లేని ఈ చేతగాని ముఖ్యమంత్రి ఎక్కుడుంటే ఏమిటి? భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తే.. జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యుడు అవుతాడు.
తన స్వప్రయోజనాలకోసం ఏకంగా రాష్ట్ర రైతాంగాన్నే బలిపెట్టాడు
జగన్ రెడ్డి తెలివితక్కువతనం అసమర్థత ఇప్పటికే ఏపీ రైతులకు పూర్తిగా అర్థమైంది. ఇలాంటి వ్యక్తికి ఉన్నపళంగా ఒక్కసారిగా. పక్కరాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర రైతుల నీటి అవసరాలు గుర్తురావడం విచిత్రం గా ఉంది. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి 2019 ఎన్నికల సమయంలో తనకు అందించి న సహాయ సహాకారానికి ప్రతిఫలంగా ఏకంగా రాష్ట్ర జీవనాడి అయిన పోలవరా న్నే గోదాట్లో ముంచేసిన ఘనుడు ఈ జగన్ రెడ్డి.
స్వయంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రే … జగన్ రెడ్డి జగన్నాటకాన్ని తెలంగాణ అసెంబ్లీలో బయటపెడితే ఈ ముఖ్యమంత్రి.. మంత్రి అంబటి అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఇలాంటి వీళ్లు 54 నెలలుగా చోద్యం చూసి, రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాలను పొరుగు వారికి ధారాధత్తం చేసి, స్వప్రయోజనాలకోసం ఏకంగా రాష్ట్ర రైతాంగాన్నేబలిపెట్టా రు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీకి కేటాయించిన కృష్ణాజలాల్లో సగం నీళ్లు తమవే అంటే జగన్ రెడ్డి మాటమాత్రంగా కూడా అపెక్స్ కౌన్సిల్ లో నోరు తెరవలేదు. జగన్ రెడ్డి అసమర్థత వల్లే కేంద్రప్రభుత్వం ఇరురాష్ట్రాలకు గతంలో కేటాయించిన కృష్ణాజలాల కేటాయింపులపై పున:సమీక్షకు ఆదేశించింది.
చంద్రబాబుకేసుల్లో వాదనలు వినిపించడానికి వందలకోట్లు ఇచ్చి మరీ ఢిల్లీ లాయర్లను పిలిపించిన జగన్ రెడ్డికి… ఏపీకి రావాల్సిన కృష్ణాజలాలపై వాదనలు వినిపించడానికి మాత్రం తీరికలేదు
తన కింద 31మంది ఎంపీలను ఉంచుకొని కూడా జగన్ రెడ్డి ఏపీకి న్యాయంగా రావాల్సిన నీటిపై పోరాడలేకపోయారు. సీబీఐ కేసుల్లో తనకుటుంబానికి నోటీసులు రాకుండా ఉండటానికి… బాబాయ్ హత్యకేసు నుంచి తమ్ముడు అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడానికి.. తన కుటుంబ పాత్ర, ప్రమేయం జనానికి తెలియకుం డా ఉండటానికి రాష్ట్ర రైతాంగం హక్కుల్నే జగన్ రెడ్డి పక్క రాష్ట్రానికి అప్పగించాడు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడానికి.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి జగన్ రెడ్డికి సమయం ఉంది.
చంద్రబాబుకు శిక్ష పడేలా చేయడానికి..ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి వందలకోట్లు ఇచ్చిమరీ ఢిల్లీ లాయర్లతో న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడానికి జగన్ రెడ్డికి డబ్బులున్నాయి. కానీ కృష్ణాజలాలపై ఏపీ తరుపున సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించ డానికి మాత్రం వైసీపీ ప్రభుత్వానికి సమయం లేదు. కారణం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో జగన్ కున్న లాలూచీ వ్యవహారం. తెలంగాణ సహా హైదరాబాద్ లో ఉన్న తనఆస్తులు కాపాడుకోవడానికే జగన్ రెడ్డి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు . కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. గతంలో జగన్ తండ్రేమో కృష్ణామిగులు జలాలపై అన్ని రాష్ట్రాలకు హక్కులున్నాయని చెప్పి ఆనాడు రైతుల్ని నట్టేట్లో ముంచాడు.
జగన్ రెడ్డి ఇరిగేషన్ రంగానికి ఖర్చుపెట్టానంటున్న రూ.25 వేల కోట్లలో 10 వేలకోట్లు జీతాలకు పోతే.. 15 వేలకోట్లు తన బినామీల కంపెనీలు.. తాబేదార్లకు దోచిపెట్టాడు
చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో సాగునీటి రంగానికి రూ.68,293కోట్లు ఖర్చుపెట్టారు. 23 ప్రాజెక్టులు పూర్తిచేసి 32లక్షల ఎకరాలు స్థిరీకరించి.. 7 లక్షల ఎకరాలకు టీడీపీప్రభుత్వంలో నీళ్లందించాం. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ఏం ఏడ్చాడో చెప్పాలి. జగన్ రెడ్డి ఇరిగేషన్ రంగానికి ఖర్చుపెట్టానంటున్న రూ.25వేల కోట్లలో 10వేలకోట్లు జీతాలకుపోతే.. 15వేలకోట్లు తన బినామీల కంపెనీలు.. తాబేదార్లకు దోచిపెట్టాడు. టీడీపీప్రభుత్వంలో పూర్తైన సంగం బ్యారేజీ వంటి వాటికి గేట్లు పెట్టి.. తన అయ్య పేరు పెట్టుకున్నాడు. కడపజిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ను తన ఇసుక దోపిడీతో కొట్టుకుపోయేలా చేశాడు. పింఛా ప్రాజెక్ట్ ను నీళ్లపాలు చేశాడు.
స్వయంగా కేంద్రమంత్రే.. జగన్ రెడ్డి ఇసుకదోపిడీ వల్లే ప్రాజెక్టులు కొట్టుకు పోయాయని వ్యాఖ్యానించారు. వెలుగొండ టన్నెల్ పూర్తయ్యాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డికి.. ఇకముందు ఓట్లు అడిగే బాధే లేకుండా పోయింది. వెలుగొండి నిర్వాసితుల్ని నట్టేట్లో ముంచాడు. టీడీపీ హాయాంలో 90శాతం పూర్తైన మొదటి టన్నెల్ ను కూడా పూర్తిచేసి నీళ్లు ఇవ్వలేకపోయాడు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల్ని అలంకారప్రాయంగా మార్చాడు. చంద్రబాబునాయుడు కుప్పం సరిహద్దుల వరకు కృష్ణాజలాలు తీసుకెళితే, 54 నెలల్లో జగన్ రెడ్డి.. అతని చేతగాని ప్రభుత్వం ఒక్క టీఎంసీ నీరు ఇవ్వలేకపోయింది.
చంద్రబాబు గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు నీళ్లిస్తే.. జగన్ రెడ్డి తన హాయాంలో ఒక్క ఎకరాకు చుక్కనీరు ఇవ్వలేదు. ఇలాంటి ముఖ్యమం త్రి ఎక్కడుంటే ఏమిటి? ‘జలసిరుల సీమ’ అంటూ… సాక్షి పత్రికలో వార్తలు రాయించావు కదా జగన్ రెడ్డి? చంద్రబాబు కృషి వల్ల అవుకు ప్రాజెక్ట్ కు నీళ్లు వెళ్తే… దాన్ని తానే పూర్తిచేసినట్టు.. జగన్ రెడ్డి తన అవినీతి మీడియాలో ప్రజలసొమ్ముతో తప్పుడు ప్రకటనలు వేయించాడు.
అవుకు టన్నెల్ నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ఖర్చు ఎంత.. నువ్వు పెట్టిన ఖర్చెంతో చెప్పు జగన్ రెడ్డి? అవుకుటన్నెల్ ను నువ్వే పూర్తిచేస్తే… పూలు చల్లేటప్పుడు మీడియాను ఎందుకు అనుమతించ లేదు జగన్ రెడ్డి? ఎన్నాళ్లు ఇలా బొంబాయి కబుర్లు చెబుతావు మోసపురెడ్డి? రైతాంగాన్ని ముంచేసిందికాక పుడింగిలాగా… కబుర్లు చెబుతున్నావా? రాయలసీమ లిఫ్ట్ ను పెద్దిరెడ్డి కంపెనీలకు.. వేమిరెడ్డి.. విజయ సాయిరెడ్డి బినామీల కంపెనీలకు అప్పగించి .. జనం సొమ్ముని దోచిపెట్టావు.
జగన్ రెడ్డికి తెలిసిందల్లా చంద్రబాబుని..టీడీపీనిచూసి ఏడవడమే పట్టిసీమ పంపులు ఆన్ చేయకుండా 14 లక్షల ఎకరాలు బీడుపెట్టాడు
నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధిలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని 3 లక్షల ఎకరా ల్ని ఎండబెట్టిన జగన్ రెడ్డి.. కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్ని బీడుపెట్టాడు. మొత్తంగా 14 లక్షల ఎకరాలలో పంటలే వేయలేదు. కారణం జగన్ రెడ్డి చేతగానితనమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టిసీమకు 120 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవచ్చు. టీడీపీ హాయాంలో 350 టీఎంసీల నీళ్లు తెచ్చాం. చంద్రబాబు రూ.1450 కోట్లతో నిర్మించిన పట్టిసీమ రూ.41వేలకోట్ల సంపద ఇచ్చింది.
కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టును బతికించింది. పట్టిసీమ లిఫ్ట్ లోని 24 పంపుల్లో 6 పంపులు పనిచేయడం లేదు. చంద్రబాబు కట్టించిన పట్టిసీమ లిఫ్ట్ తానెందుకు వాడాలని పంటలు ఎండిపోతున్నా నీళ్లివ్వకుండా ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి కుళ్లుబోతుతనంతో వ్యవహరించాడు. జగన్ రెడ్డికి తెలిసిందల్లా చంద్రబాబుని… టీడీపీని చూసి ఏడవడమే. తన పెళ్లిరోజు అంటూ ఇకిలించి.. సకిలించి జగన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ ఎత్తిపోతల పథకం నిర్మాణ కాంట్రాక్టర్ రాష్ట్రం వదిలి పారిపోయాడు.
పల్నాడులో అధికారాంతంలో మొక్కుబడిగా నువ్వు ప్రారంభించిన వరికపూ డిశెల ఎత్తిపోతల పథకం పరిస్థితేంటో చెప్పు జగన్ రెడ్డి? ఈ చేతగాని ముఖ్య మంత్రి నీళ్లులేని ఉత్త టన్నెల్ (వెలుగొండ టన్నెల్) ను జాతికి అంకితం చేస్తానంటున్నాడు. అదీ.. ఈ జగన్ రెడ్డి సాగునీటి నిర్వహణ.” అని దేవినేని ఉమా ఎద్దేవాచేశారు.