బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజం
విజయవాడ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో సుపరిపాలన అయితే బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్న విషయాలను వివరిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే 200 కోట్లు నగదు అధికారికంగా లెక్క తేల్చారు. అయితే ఇంకా లెక్క తేల్చాల్సిన నగదు ఇంకా ఉందని అధికారులు చెబుతున్న తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ఎంపిల అవినీతి ఎంత అన్నది తేలుతోంది. నాటు సారా తో ఈసొమ్ము సంపాదించినట్లు గా తెలుస్తోంది. ఇదంతా నల్లధనమే అన్నవిషయం ప్రజలకు అర్ధం అవుతోందన్నారు.చత్తీస్ ఘడ్, ఒరిస్సా, జార్ఖాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యుల పై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోంది.
అవినీతిని దేశం నుండి నిర్మూలించి, దేశాన్ని అభివ్రుద్ది పధంలో పయనింప చేయడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రమిస్తుంటే భావసారూప్యత లేని రాజకీయ పార్టీలు అన్ని ఒక వేదిక పైకి వచ్చి నరేంద్రమోదీని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నాయకుడు మల్లిఖార్జున ఖర్గే బిజెపిని ఓడించడం కోసమే కూటమి అంటున్నారు. అయితే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి. బెంగుళూరులో ఒక కాంగ్రెస్ నేత ఇంటి పై దాడులు జరిగితే 42 కోట్లు రూపాయల నగదు అధికారులు గుర్తించిన సంగతి విధితమే. పశ్చిం బెంగాల్ లోని చటర్జీ అనే మంత్రి ఇంట్లో 50 కోట్లు నగదు లభ్యం కాగా టీచర్ ఉద్యోగ నియామాకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల పై దాడులు చేస్తే ఈ నగదు వెలుగు చూసిన నేపధ్యం.
ఉత్తర ప్రదేశ్ లో పీయూష్ జైన్ ఇంట్లో 200 కోట్లు లభ్యం అయిన సంఘటన అదేవిధంగా 2022 జూలై లో సత్యేంద్ర జైన్ ఇంట్లో 3 కోట్లు , బంగారం, జార్కాండ్ లో బొగ్గు ఘనుల స్కాంలో 1500 కోట్లు, ఉపాది హామీ పనుల్లో 500 కోట్లు స్కాం జరిగిందనే విషయాలు వెలుగు చూసాయి. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో అవినీతి భారీ స్ధాయిలో జరగుతోంది. తమిళనా డులో కూడా అవినీతికి అంతం లేని పరిస్ధితిలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.