-పరువు నష్టం దావా నామీద వేయడం కాదు
-మీ బావమరిది మీ అనుచరులు మీ అవినీతి బాగోతంపై వేయండి
– ముత్యాలంపాడు కందులపాడు మధ్య పడిపోయిన కాజ్ వే ను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు
జీ.కొండూరు మండలం : మీ అవినీతిని బయట పెట్టడానికే ఈ తుఫాన్లు వచ్చాయి. దశాబ్దాల కాలంగా ఉన్న బ్రిడ్జిని భ్రష్టు పట్టించారు. ,లోపభూయిష్టంగా ముత్యాలంపాడు – కందులపాడు వద్ద బుడమేరుపై బ్రిడ్జి నిర్మాణం పనులు. ఏ అధికారి, ఏ శాఖ అనుమతులు ఇచ్చారో? ఎవరు నిర్మాణం చేశారో దీని వెనక ఎవరు ఉన్నారో అందరిపై విచారణ చేపట్టాలి. వీటన్నింటిపై విచారణ జరిపించాలి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.మండల కేంద్రానికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి 15 – 20 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది.
మీ అవినీతి బాగోతం, కక్కుర్తి వల్ల ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఎంత మంది ప్రాణాలు పోయేవో?ఇక్కడ ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏ1 ముద్దాయి. పరువు నష్టం దావా నామీద వేయడం కాదు. మీ బావమరిది మీ అనుచరులు మీ అవినీతి బాగోతంపై వేయండి. బాపట్ల మేరీని ఎవరు చంపారు? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు. అన్ని నువ్వే మాట్లాడావు. మీ బావమరిదికి ఏం చెప్పావు ఆయన ఏం మాట్లాడాడు మీ లాయర్ బెనర్జీ ని అవికూడా చెప్పమను.