Suryaa.co.in

National

అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఇదే

అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ చిత్రం విడుదల అయింది. విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంఛార్జి శరత్ శర్మ ఈ ఫొటోలను విడుదల చేశారు. చిన్నారి రామయ్య నల్లరాతి విగ్రహానికి కళ్ల గంతలు కట్టి ఉంచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని ఉన్నాడు. ఈ బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తు, 1.5 టన్నుల బరువు ఉంది.

LEAVE A RESPONSE