Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఆటవిక పాలనపై లోకేష్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు

– తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
– పేదలకు బడ్డీ కొట్లు ప్రధానం
-మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావ్

లోకేష్ జన్మదినోత్సవం నాడు పేదలు వారి సొంతకాళ్లపై వారు నిలబడేలా వారికి బడ్డీ కొట్లు ప్రధానం చేయడం చాలా ఆనందం కలిగించింది. రాబోయే తరాలకు కాబోయే నాయకుడు లోకేష్. ఆయన ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలి. రాబోయే కాలంలో పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. గత పదేళ్ల నుంచి లోకేష్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. తండ్రిలోని కష్టపడే తత్వం, తాతలోని పట్టుదల లోకేష్ బాబులో పుష్కలంగా ఉన్నాయి. జగన్ రెడ్డి ఆటవిక పాలనపై లోకేష్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు హరించబడుతున్న సమయంలో యువగళంతో ఆ హక్కులను తిరిగి ప్రజలకు అందించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి కృషి చేశారు. జగన్ రెడ్డి ప్రజాస్వమ్యానికి వేసిన తాళాలను పగులగొట్టి హరిజన, గిరిజనుల కోసం గొంతు విప్పిన యువనేత లోకేష్. 227 రోజులుగా, 3000 కి.మీలకు పైగా యువగళంతో ప్రజలతో మమేకమై ప్రజాస్వామ్యానికి జగన్ రెడ్డి విధించిన దాస్యశృంకలాలను లోకేష్ పగులగొట్టిన తీరు అభినందించక తప్పదు.

అమెరికా సైన్యం 50 లక్షలైతే…తెలుగుదేశం సైన్యం 60 లక్షలు…అటువంటి సైన్యాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా లోకేష్ రాష్ట్రంలో 30 వేల కి.మీ రోడ్లు వేశారు. కానీ, నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం 3 కి.మీ కూడా వేయలేని దుస్థితి.

రాబోయే 40 ఏళ్లకు కాబోయే నాయకుడు లోకేష్: నక్కా ఆనంద్‌బాబు
యువనేత లోకేష్ జన్మదినోత్సవం సంధర్బంగా స్థానిక నేత కొమ్మారెడ్డి కిరణ్ పేదలకు బడ్డీ కొట్లు తయారుచేసి పంచడం చాలా ఆనందదాయకం. లోకేష్ పోరాట పటిమ చూసి వైకాపా నేతలకు కంటిమీద కునుకు రావడం లేదు. సైకో పాలనపై మొక్కవోని పట్టుదలతో పోరాటం చేస్తూ లోకేష్ యువతకు మార్గదర్శకంగా నిలిచారు. యువగళంతో రాష్ట్రవ్యాప్తంగా యువతలో ఉత్తేజాన్ని నింపారు. లోకేష్‌పై అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు.

యువగళంతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే 40 ఏళ్లకు సమర్ధవంతమైన నాయకుడు లోకేషే. తెలుగుదేశం సామన్య కార్యకర్త నుంచి అధినేత వరకు సైకో రెడ్డి పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు, అణచివేతలను లోకేష్ ఎదుర్కొన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా యువనేత క్రియాశీల పాత్ర పోషించబోతున్నారు. ఆయనకు మనందరి మద్దతు సంపూర్ణంగా అందించాలని కోరుకుంటున్నాను.

తెలుగుదేశం కు లోకేష్ ఒక ఆశాకిరణం- పిల్లి మాణిక్యాల రావు
లోకేష్ అసమర్ధుడని, తెలుగుదేశంను నడిపించలేడని వైకాపా నాయకులు అనేక దుష్ప్రచారాలు చేశారు. కానీ, గత ఐదేళ్లుగా ఎన్నో సంక్షోభాలను సోపానాలుగా మార్చుకుని అధికారపార్టీ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన యువనాయకుడు లోకేష్. యువగళంతో యువతకు ఒక సంకల్పాన్ని సాకారం చేసేందుకు ఎంతో కృషి చేశారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువతకు మార్గనిర్ధేశం చేశారు.

LEAVE A RESPONSE