– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న ప్రతి టీమ్ మెంబర్కు ధన్యవాదాలు. ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంది. దేశానికి సేవ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు.