Suryaa.co.in

Andhra Pradesh

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి

– కార్యకర్తలకు భువనమ్మ పిలుపు

చోడవరం: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు.మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి..తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. ప్రజలకోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి..పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు.

గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీ కి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యివుంటే అమరావతి పూర్తయ్యి ఉండేది. జగన్ 3 రాజధానులు అని ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ నే. మన రాజధాని అమరావతే.ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. వైసీపీ చేతిలో నుండి ఏపీ ని కాపాడుకుందాం.

LEAVE A RESPONSE