ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరికొందరు పోలీసుల అరెస్టు ?
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని కూడా విచారిస్తున్నారు. వారిని కూడా త్వరలో అరెస్టు చూపించే అవకాశాలున్నాయి.