Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు భాషను బతికించుకోవాలి

– ఉషా ఎడిటర్ శరత్ చంద్ర

తెలుగు భాషను బతికించుకోవడానికి సాహిత్యం ఒక సాధనమని ఉషా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎడిటర్ శరత్ చంద్ర అన్నారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉషా -వెలగపూడి సీతారామయ్య సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాల పునాదులపై కోట్లకు పడగ లెత్తిన వారు పత్రికలు మూసివేస్తున్న తరుణాన, పక్ష పత్రికను తేవడానికి తాము శ్రమిస్తుంది భాషను బ్రతికిoచుకోవడానికే అని శరత్ చంద్ర అన్నారు.

ఉషాకు యజమానులు ఎవరూ లేరని ప్రజలూ,రచయితలే యజమానులు అన్నారు.ఉషాకు వచ్చిన వందలాది కథలను వడపోసి మేలిమి కథలను 20 ఎంపిక చేసామని.. రచయితలు మరి కొంతమందిని ప్రోత్సహించడానికి విశిష్ట బహుమతులు పేరుతో, ప్రోత్సాహక బహుమతులు పేరుతో మరికొన్ని మేలిమి కథలు ఎంపిక చేశామన్నారు.

50 వేల బహుమతి
తటవర్తి భారతి స్మారకార్థం నిర్వహించే కథల పోటీకి గడువు జూన్ 15.. వరకూ ఉందన్నారు. ఆ పోటీలో వచ్చే మరి కొన్ని మేలిమి కథలతో ఒక కథా సంకలనం తీసుకొస్తామన్నారు. మానవ సమాజంలోని భిన్న పార్శ్వాలను స్పృశించే కథలను ఆహ్వానిస్తున్నామన్నారు.

సుజనా ఫౌండేషన్ నవలల పోటీ
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే నవలల పోటీకి ఎంపిక చేసే మొదటి 10 నవలలకు యాఫై వేలు వంతున క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నవలల పోటీకి తుది గడువు ఏప్రిల్ 14వ తేదీ అన్నారు..మొత్తం ఐదు లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది అన్నారు.

కాగా వెలగపూడి కథల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ కంఠ స్పూర్తి గారికి , అత్తలూరి విజయలక్ష్మి గారికి శరత్ చంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. కాగా విజేతల వివరాలు ఉషా అసోసియేట్ ఎడిటర్ కట్టా రాంబాబు గారు మొదటి ఇరవై బహుమతి కథలు ప్రకటించారు. అడ్వైజరీ బోర్డు మెంబర్ కొప్పర్తి రాంబాబు గారు విశిష్ట బహుమతులు పొoదిన వారి పేర్లు ప్రకటించారు.

మరో ప్రముఖ రచయిత కొమ్మూరి రవికిరణ్ మరియు ఉషా ఫైనాన్షియల్ డైరెక్టర్ ఇమ్మడిశెట్టి సుమతి గారు ప్రోత్సాహక బహుమతులవివరాలు ప్రకటించారు.

ఈ సందర్భoగా వారు మాట్లాడుతూ అచ్చు పత్రికలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో రచయితలు అందరూ సహకార దృక్పథంతో ఒక పత్రిక తేవడం ముధావహం అన్నారు.

2000 బహుమతి పొందిన కథలు
1. యాట – మూరి శెట్టి గోవింద్
2. వైకల్యం – సలీం
3. ఉద్దతుల మధ్య – కౌలూరి ప్రసాదరావు
4. మా తుఝే సలాం – పాణ్యం దత్త శర్మ
5. నీతోనే నేను – తటవర్తి నాగేశ్వరి
6. సంతృప్తి – సూరిశెట్టి వసంత కుమార్
7. శకుంతల – తిరుమలశ్రీ
8. ఉద్దాన పతనాలు – ఇంద్రగంటి నరసింహమూర్తి
9. అపరాజిత – సుమ కైకాల
10. అమృతం కురిసిన రాత్రి – గుమ్మడి రవీంద్రనాథ్
11. తప్పిపోని గొర్రె పిల్లల కథ – వేణు మరీదు
12. ఆమె అతడిని జయించింది – డా. జమ్మలమడక కిరణ్
13. కృషితో నాస్తి దుర్భిక్షం – ఎం.వి. ఎస్.ఎస్ ప్రసాద్
14. మాణిక్యం టిఫిన్ సెంటర్ – పెనుమాక రత్నాకర్
15. దక్షిణ గట్టు – జయంతి ప్రకాశ శర్మ
16. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు – శివలెంక ప్రసాదరావు
17. నువ్వే నా పెద్ద కొడుకువి సామీ – వారణాసి భానుమూర్తి రావు
18. పొడి కళ్ళలో తడి మెరుపు – విజయ శ్రీముఖి
19. సముద్రాన్ని ఈదిన వాడు – ఎనుగంటి వేణుగోపాల్
20. అందమైన నరకం – టి.సంపత్ కుమార్
1,000 విశిష్ట బహుమతి పొందిన కథలు
1.-అనగనగా ఒక రోజు -నామని సుజనాదేవి
2. భాగ్యశ్రీ – కటుకోజ్వల మనోహరాచారి
3. కేసు నంబరు 143 – తరిగొప్పుల వి ఎల్ ఎన్ మూర్తి
4.కంచే చేను మేస్తే – ఆనుసూరి వెంకటేశ్వరరావు (అవేరా)
5. వైకుంఠపురం టూ అయోధ్యపురి – రంగనాధ్ సుదర్శనం
6.దూరపు కొండలు – తిరుమలశ్రీ
500 ప్రోత్సాహక బహుమతి పొందిన కథలు
1.ఒక జంట కలిసిన తరుణాన – గన్నవరపు నరసింహమూర్తి
2. నిరీక్షణ – వియోగి (విజయ ప్రసాద్ కోపెల్ల)
3. అది ఒక మధుర క్షణం – కె.కె.రఘునందన
4. నాలో ఉన్న నేను – పూర్ణిమ
5. ఇంతకుమించి ఏమున్నది – కోరుకొండ వెంకటేశ్వరరావు
6. ధర్మం – భాగ్యశ్రీ
7. సప్త స్వరాలు – శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి
8. బతుకు బాట – అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం
9. మూడో నెల – సయ్యద్ గఫార్
10. నేస్తమా ఏది నీ చిరునామా – వెంకట సుధా రమణ పూడిపెద్ది

LEAVE A RESPONSE