దేవినేని ఉమాకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమాకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలు అందిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు కి అదనంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా ని కలసి అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే దేవినేని ఉమాకి రాష్ట్ర పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply