చిలకలూరిపేటలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

చిలకలూరిపేటలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దివంగత ఎన్టీఆర్‌కి జోహార్లు అర్పిస్తూ చంద్రబాబు, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవనస్థితి గతులను మార్చింది కూడా ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీనేనని పేర్కొన్నారు.

Leave a Reply