Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం నెత్తిన అప్పు రూ.14 లక్షల కోట్లు

-జగన్‌ పాలనలో రూ.8 లక్షల కోట్ల దోపిడీ…
– ప్రమాదకరంగా ఆర్థిక నిర్వహణ
– తీవ్ర తలపోటుగా రెవెన్యూ లోటు
– స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయంలో అధమం
– పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబాటు
– బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ పాలనతో రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని, చేసిన అవినీతి రూ.8 లక్షల కోట్లు అని విమర్శించారు. జగన్‌ తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం మొత్తం అప్పులను రూ.14 లక్షల కోట్లకు తీసుకువెళ్లాడని మండిపడ్డారు. వైకాపా అవినీతి విధ్వంసకర పాలనలో రూ.8 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని వివరించారు. గడిచిన ఐదేళ్ల జగన్‌ పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులకు తన స్టిక్కర్‌ వేసుకుని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. జగన్‌ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఆదాయం సంపాదించే ఆస్తులు కల్పనపై దృష్టి లోపించిందన్నారు. జగన్‌ పాలనలో విచ్చలవిడి దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలలో ప్రతికూల వృద్ధి నమోదైందని వివరించారు.

రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణంలో మూలధన వ్యయం కేవలం 8 శాతం తో సగటున సంవత్సరానికి చేసిన వ్యయం దాదాపు రూ.16 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వం చేసిన వ్యయం కేవలం రూ.26 వేల కోట్ల లోపే ఉందని, ప్రాజెక్టుల మరమ్మతులు కూడా సరిగ్గా చేయలేదన్నారు. జగన్‌ ప్రభుత్వంలో సర్దుబాటు అనంతరం సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.38,500 కోట్లు అంటే రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక తలపోటుగా మారిందన్నారు. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ వసూళ్లు 15.95 శాతం అధికం, జగన్‌ పాలనలో ప్రస్తుతం 6.4 వాతం వెనుకబడిరదని లెక్కలతో చూపించారు.

2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి 3.65 శాతం అధికంగా ఉంటే జగన్‌ పాలనలో ప్రస్తుతం 0.4 శాతం వెనుక పడిరదని వివరించారు. 2014-19 మధ్య తలసరి ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి సగటున వృద్ధి 12.79 శాతం అయితే జగన్‌ పాలనలో ప్రస్తుతం 9.45 శాతం మాత్రమే ఉందన్నారు. 2018-19లో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో ఏపీ 5వ స్థానంలో ఉంటే నేడు జగన్‌ పాలనలో 14వ స్థానానికి దిగజారి వెనుకబడిన రాష్ట్రాలతో పోటీ పడుతుందని తెలి పారు. 2014 – 19 మధ్య ఆర్థిక లోటులో వడ్డీ శాతం 40.84 శాతం అయితే నేడు 50.30 శాతం అయింది అంటే కొత్త అప్పుల వాయిదాలు చెల్లించడానికి మాత్రమే సరిపోతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE