– ఈసీకి రఘురామరాజు ఫిర్యాదు
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికే జగన్ ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజా ధనంతో హెలికాప్టర్లు ఏర్పాటు చేయడంపై జోక్యం చేసుకోవాలని రఘురామ కోరారు.