లోకేష్‌తో సుజనా భేటీ

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పొత్తులో భాగంగా జరుగుతున్న పరిణామాలు, మారుతున్న సమీకరణలపై వారిద్దరు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, సుజనా విజయం కోసం పనిచేస్తారని లోకేష్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.

Leave a Reply