– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి
పాలకొల్లు: మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమం రాబోయే 2024 ఎన్నికల్లో మొదటగా ఓటు వేయబోతున్న యువతకు వారి బాధ్యతను గుర్తు చేయడానికి ఎంతో ఉపయోగపడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి కొనియాడారు. ఏ పి వారియర్స్ కార్యక్రమంలో భాగంగా ” మై ఫస్ట్ ఓట్ ఫర్ సి బియన్”ను పాలకొల్లులోని పోడూరు పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా యువతను ఉద్దేశించి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి ఓటు హక్కు ప్రాధాన్యతను యువతకు వివరించారు. ‘ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఏకైక సాధనం. దేశ చరిత్రనే మార్చేయగల ప్రజాస్వామ్య ఆయుధం. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు కల్పించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.
ఓటు హక్కు పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయినటువంటి ఓట్లను జగన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తూ వైసీపీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. భవితను మార్చే అస్త్రం ఓటు..స్వర్ణాంధ్రను సాకారం చేసే చంద్రబాబా నాయుడికే వేద్దామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
యువత భవిష్యత్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మొదటి ఓటు చంద్రబాబుకి వేసి సద్వినియోగం చేసుకోవాలని రాజ్యలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కమిటీ కార్యదర్శి తాయారు, బండి స్వర్ణలత, సుంకర రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.