నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలి

ముగ్గురు అధికారులపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
ముగ్గురు అధికారులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

నెల్లూరు ఎస్పీ డాక్టర్ కె. తిరుమలేశ్వర్ రెడ్డి పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మామ అయిన దుగ్గిరెడ్డి గురువా రెడ్డి వైసీపీ నాయకుడు. గతంలో ఈయన నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీగా పనిచేశారు. వైసీపీలో చాలా ప్రధానమైన వ్యక్తి. సీనియర్ నాయకుడు. నెల్లూరు జిల్లాలో వైసీపీని గెలిపించాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. 10కి 10 సీట్లు గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు.

ఆయనకు అల్లుడు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి సహకరిస్తున్నాడు. వారి మామగారు ప్రధాన నాయకుడు. మామ దుగ్గిరెడ్డి గురవారెడ్డి నెల్లూరుకు వచ్చినప్పుడల్లా ఆయన వెంట వైసీపీ గణం వస్తుంది. ఎస్పీ ఇల్లు ఒక క్యాంప్ ఆఫీసుగా తయారైంది. గురవారెడ్డి వచ్చినప్పుడల్లా ఆయనను భుజాన వేసుకొని తీసుకెళ్తుంటారు. ఎస్పీ ఇంట్లోనే మకాం వేస్తారు. కాగా.. ఎస్పీ ఆఫీసు వైసీపీ నాయకులకు ఒక చిన్న అడ్డాగా మారింది. ఎస్పీ అన్ని పార్టీల నాయకులను సమానంగా చూడాలి. అన్ని రాజకీయ పార్టీలకు సమ న్యాయం చేయాలి. తప్పు చేసినవారిని శిక్షించాలి.

కానీ వైసీపీవారు తప్పు చేస్తే మామ గారి పార్టీ అని మనవాళ్లే అని వదిలేస్తున్నట్లున్నారు. విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఈయనే స్వయంగా అరుస్తున్నాడు. వైసీపీ నాయకులకు ఎస్పీ గారి ఇంట్లోనే భోజనాలు. ఎక్కడా ఉంచకూడదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. ఆయనే తప్పుకోవాలి. వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డికి కుడి భుజంగా ఉంటున్నాడు.ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఒక మినీ వైసీపీ బ్రాంచ్ ఆఫీసుగా తయారైంది. ఎస్పీకి నైతిక విలువలుంటే ఆయనే రాజీనామా చేయాలి. వెంటనే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని వెంటనే తొలగించాలి

తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపొర మండలం మున్నంగిలో ఇసుక త్వకాలు ఆపాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మైనింగ్ ఆపాలంది. అయితే మున్నంగిలో ఇల్లీగల్ మైనింగ్ బాహాటంగా జరుగుతోంది. ఎవరూ ఆపటంలేదు. నిన్న టీడీపీ నాయకులు ఆపడానికి వెళితే వైసీపీ నాయకులు తొక్కేయండిరా, చంపేయండిరా అన్నారు. ముగ్గురికి దెబ్బలు తగిలాయి. ఈ ముగ్గురిలో బాలరాజు అనే వ్యక్తి ఆసుప్రతిలో ఉన్నారు.

ఎన్నికల కమిషన్ మాకు సంబంధం లేదనడానికి వీలు లేదు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగితే ఆపొద్దా. ఏ కలెక్టర్ కూడా నిబంధనలు పాటించడంలేదు. అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అక్రమ ఇసుక తవ్వకాలతో డబ్బులను సంపాదించి ఎలక్షన్ లో వాడుతున్నారు. ఇదంతా జగన్ ప్లాన్. అందుకే మైనింగ్, రెవెన్యూ శాఖవారు అక్రమ మైనింగ్ ని ఆపడంలేదు. కల్పించుకోవాలి. వెంటనే యాక్సన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.

బాపట్ల జిల్లాలోని వేమూరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వి. అశోక్ బాబు అనే వ్యక్తి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన డబ్బుతో బాగా మదించి ఉన్నాడు. ఆయనకు చిన్నా పెద్దా తేడా కనపడటంలేదు. ఆకాశంలో గాల్లో నడుస్తున్నాడు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో ప్రెస్ లో మాట్లాడుతూ ‘‘ఎన్నారైలందరు వైసీపీకి ఓట్లు వేయకుండా తెలుగుదేశంకు ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా వేస్తే మిమ్మల్ని మరలా మీ దేశాలకు వెళ్లనివ్వను, తొక్కేస్తానన్నాడు. పోటీ చేసే వ్యక్తి అలా మాట్లాడొచ్చా?

ప్రెస్ లో అలా మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. వెంటనే ఆయనను అరెస్టు చేయాలి. అతనిపై చర్యలు తీసుకోవాలి. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. డీజీపీ రాజేంద్రనారెడ్డి నేతృత్వంలో ఏ ఒక్క పోలీసు కూడా వారి విధులు నిర్వహించడంలేదు. అందుకే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం.
పోటీ చేస్తున్న వ్యక్తి మాట్లాడిన మాటలు రికార్డు కూడా చేశాం.వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలి.

3 ఫిర్యాదులు డిల్లీ ఛీఫ్ ఎన్నికల అధికారికి కూడా మెయిల్ లో ఫిర్యాదు చేశాం. వీరు చేస్తున్న ఈ పద్ధతి సరైంది కాదు. వైసీపీ నాయకులు ప్రజా క్షేత్రంలో పోరాడాలి గానీ.. ఇలా అడ్డ దారుల్లో పోకూడదు. ఈక్వెల్ గా ఉండాలి. వైసీపీ నాయకులకు ఎస్పీ ఇంట్లో భోజనాలు పెట్టించి పంపడమేమిటి? డీజీపీకి ధైర్యం ఉంటే ఎస్పీని తొలగించాలి. ఎలక్షన్ కమిషన్ తొలగించక ముందే డీజీపీ కి ధైర్యం, నైతిక విలువలు ఉంటే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిని తొలగించాలి.

 

Leave a Reply