దళిత ద్రోహి జగన్ రెడ్డి

జగన్ జమానాలో 11 వేలకు పైగా దళితులపై దాడులు…188 మంది ఊచకోత
జగన్ చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు క్షమించరు
జగన్ రెడ్డి బచ్చాగా గోలీలు ఆడుకుంటున్న సమయంలోనే నేను సి.ఎం
జగన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా?
జగన్ చెవిలో పువ్వు పెట్టి రాజకీయ విరామం ఇవ్వండి
సంపద సృష్టించే నాయకుడు కావాలా…దివాలా తీయించే నాయకుడు కావాలా?
పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం
సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు

నాయుడుపేట : సభకు విచ్చేసిన జనం ప్రభంజనం చూస్తుంటే కూటమి విజయం ఖాయం. శిశుపాలుడు వంద తప్పులు చేసినా శ్రీకృష్ణుడు క్షమించాడు. జగన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశాడు. జగన్ రెడ్డిని మీరు క్షమిస్తారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహం కూటమి విజయానికి నాంధి కావాలి. సూళ్లూరు పేట ప్రజలు వైసీపీని నమ్మి 2019 లో ఓట్లేస్తే వారిని నిలువునా మోసం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరి ప్రజలను నమ్మించి గొంతు కోశాడు. ముద్దులు పెట్టి పిడుగుద్దులు గుద్దాడు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్క ఎస్సీలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను.

జగన్ రెడ్డి ఇచ్చేది పది దోచేది వంద రూపాయలు. ప్రజలను గొర్రెలుగా భావించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి పనికిరాడు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో దిట్ట. పేదవాళ్లకు సహాయం చేయాలని ఆయనకు ఏ కోశాన లేదు. తిరుపతి పార్లమెంటులో కూటమి అభ్యర్ధి వరప్రసాదరావు, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయశ్రీ కి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా.

ఈ ప్రాంత ప్రజలు ప్రపంచాన్ని శాసించాలన్న ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వంలో ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఇక్కడకు తెచ్చాం. టీసీఎల్, హీరో. జోరో, సెల్ కాన్, డిక్సన్ లాంటి కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ జగన్ రెడ్డి జాకీ, అమర్ రాజాను లాంటి కంపెనీలను ఇక్కడ నుంచి తరిమేశాడు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి. ఐఐటీ, ఐసర్ లాంటి కంపెనీలను తిరుపతికి తీసుకొచ్చా. టీసీఎల్, హీరో. జోరో, సెల్ కాన్, డిక్సన్, కియాలు బాబు బ్రాండు అయితే.. జగన్ బ్రాండు బూం బూం. జగన్ రెడ్డి ఎర్రచెందనం స్మగ్లర్లకు ఎమ్మెల్యే టికెట్లు, లూటీదార్లకు ఎంపీ సీట్లు ఇస్తున్నాడు.

జగన్ రెడ్డి చరిత్ర మరిచి నాపై విమర్శలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి బచ్చాగా గోలీలు ఆడుకుంటున్న సమయంలోనే నేను సి.ఎం. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే ముందే నేను ముఖ్యమంత్రి. జగన్ రెడ్డి ఓ సారి చరిత్ర తెలుసుకో. మెగా డీఎస్పీపైనే నా మొదటి సంతకం చేస్తా. రెండు, మూడు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తా. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉంటే 8 సార్లు డీఎస్పీ ఇచ్చి 1.50 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. ఎన్టీఆర్ మూడు సార్లు డీఎస్పీలు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొత్తం 11 డీఎస్సీలు ఇచ్చాం. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు.

జగన్ రెడ్డి హయాంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలు గుండు సున్నా. యువత తరపున నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? జగన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు. నెలకు రూ.5 వేలు జీతం గల ఉద్యోగం ఒక ఉద్యోగమేనా. వాలంటీర్లు వైసీపీ ప్రలోభాలకు గురికావద్దని మనవి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారిని మేం కొనసాగిస్తాం. కాబట్టి మీరు తటస్తంగా ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. బాగా చదువుకున్న వారికి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం చూపిస్తాం.

జగన్ రెడ్డి నేడు సెంటు ఇళ్ల స్థలం ఇస్తే..నేను గతంలోనే రెండు సెంట్లు ఇచ్చాను. జగన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలను నేను రద్దు చేయను. ఇళ్ల స్థలాల కోసం ప్రజల వద్ద తక్కువ రేటుకు భూమి కొని వైకాపా నాయకులు ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అమ్ముకుని దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో మాదిరి రెండు సెట్లు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిచ్చే భాధ్యత తీసుకుంటాం.

• జగన్ రెడ్డి పాలనలో కొండలు కొడలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా మిగిలే పరిస్థితి లేదు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో రూ.25 వేల కోట్లు స్కాంకు పాల్పడ్డారు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున స్కాంకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే టిడిఆర్ బాండ్లు రద్దు చేస్తాం. అవినీతి లెక్క తేలుస్తాం.

. ట్యాంకులో నీళ్లు ఉన్నప్పడే కుళాయిలో నీరు వచ్చినట్లు రాష్ట్రానికి ఆదాయం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలం, ఆదాయం వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమాంనికి ఖర్చు చేస్తాం. సంక్షేమానికి జగన్ రెడ్డి పది ఇస్తే.. నేను 15 ఇస్తాను. అంతేకాకుండా లక్ష రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపెడుతాను. డబ్బులు ఇవ్వడమే కాకుండా పేదలను అన్ని విధాల ఆదుకునేందుకు కార్యక్రమాలను తీసుకొస్తాం.

రిలయన్స్ కంపెనీ ప్రస్థాననే ఇక్కడ మంచి ఉదాహరణ. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్ అంబానీలు ఇద్దరు కుమారులు. తండ్రి చనిపోయిన తర్వాత ముఖేష్, అనిల్ అంబానీలకు తండ్రి ఆస్తిని సమానంగా పంచారు. కానీ అనిల్ అంబాని దివాలా తీశాడు. ముఖేష్ అంబానీ మరింత కుబేరుడయ్యాడు. సంపద సృష్టించకపోతే మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇలాగే ఉండే ప్రమాదం ఉంది. అందుకే సంపద సృష్టించే నాయకుడు మీకు కావాలా లేక దివాలా తీయించే నాయకుడు కావాలా?

సూళ్లూరుపేట నియోజకవర్గం ఎస్సీలకు కంచుకోట. జగన్ రెడ్డి అందరికీ ఇచ్చే కార్యక్రమాలే దళితులకు ఇచ్చాడు. వారికి ప్రత్యేకంగా ఏది అమలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు రద్దు చేశాడు. నేను అంబేడ్కర్ విదేశీ విద్యా విధానం తీసుకొచ్చి ఎస్సీ పిల్లలను అంతర్జాతీయంగా ఉన్నత విద్యనభ్యసించేలా చేస్తే ఆ పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నాడు. జగన్ రెడ్డి నీవేమన్నా అంబేడ్కర్ కంటే గొప్పవాడివా? ఇది దళిత ద్రోహం కాదా?

దళితులు మాట్లాడితే గొంతు నులుమి చంపేస్తున్నారు. ఐదేళ్లలో 11 వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయి. 188 దళితులను ఊచకోత కోశారు. కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. దళితులంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. దళితులకు టిడిపి అండగా ఉంటుంది. దళితుల్లో పేదరికం పోగొడుతాం. టిప్పర్ డ్రైవర్ కి సీటిస్తే నేను విమర్శించాననడం అబద్ధం. నేను ఎక్కడా విమర్శించలేదు. దళితులపై కపట ప్రేమే వద్దన్నాను. రెడ్లను పెళ్లి చేసుకున్న ఎస్సీలకు సీటు ఇస్తారా? ఇదేనా సామాజిక న్యాయమంటే. ఇలాంటివి నేను చాలా చూశాను.

జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఒరిజనల్ గా పింఛన్ ను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనే. ఎన్టీరామారావు 35 రూపాయలతో పింఛన్ ప్రారంభించారు. నేను 2వేలకు తీసుకెళ్లాను. పింఛన్ 4 వేలు చేస్తాను. ఇంటివద్దనే ఇస్తాను. మొదటి తేదీననే ఇస్తాను. 3 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మీరు బయటికి వెళ్లినా 12 వేలు ఒకేసారి ఇస్తాను. కోతలు ఉండవు. ఆంక్షలుండవు. నేనొస్తే పేదవాడి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వంగా మారుస్తాను. మీ అందరికి అండగా ఉంటాను.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను. ఇది నా కమిట్ మెంట్. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తిని. జగన్ ఎక్కడ చదివాడు? అసలు అతనికి డిగ్రీ వచ్చిందా? జగన్ చదివింది రహస్య యూనివర్శిటీ. ఇలాంటి ఫేక్ ఫెలో నా గురించి మాట్లాడితే బాధేస్తుంది. బాబాయి గొడ్డలివేటు, కోడికత్తి డ్రామా చూశారు. ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి డబ్బులు నింపి మీ ఊరిలో స్టాక్ పెట్టారు.

20 నుండి 30 కోట్లు పెట్టి డబ్బులు పంచి, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు. నీ ఆటలు సాగవు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికొకరు చొప్పున ఒక్కో రోజు ఒకరు బయటికి రావాలి. మీ ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత ఏం చేయాలో అది చేసి చూపుతాను

 

Leave a Reply