Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ పేదల పక్షం

-వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పక్షం
-ఏసు ప్రభువు పుట్టిన రోజు సాక్షిగా జగన్ ఏం చదివారో చెప్పాలి
నా దగ్గర జగన్ బచ్చా
-చట్టపరంగా కులగణన…దామాషా ప్రకారం నిధులు ఖర్చు
-సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం
-చివరి ఆయకట్టుకూ సాగునీరందించి వలసలు నివారిస్తాం
-కురబ, బుడగజంగాలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి
-సీమ ప్రాజెక్టులకు మేం రూ.12వేల కోట్లు ఖర్చు… జగన్ చేసిన ఖర్చు రూ.2వేల కోట్లు
-ఎంపీటిసీకి ఎంపీ సీటు ఇచ్చిన చరిత్ర టీడీపీది
-ఎమ్మిగనూరుకు టెక్స్ టైల్ పార్కు తీసుకొస్తా
-కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఎమ్మిగనూరు : ప్రజల మద్ధతు కోసమే ప్రజాగళం. ఎన్నికల వేడి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. వైసీపీ ఓడించాలన్న కసి మీలో ఉంది. మీరు పడిన బాధలకు విముక్తి దొరుకుతుంది. బీవీ మోహన్ రెడ్డి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఆయన ఎమ్మిగనూరుకి ఎన్నో సేవలు అందించారు. ఆ ఒరవడిని కొనసాగించేందుకే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు.

సామాజిక న్యాయం చేసేది టీడీపీ, బూటకపు న్యాయం చేసింది వైసీపీ. నా జీవితంలో ఇంత ఉత్సాహం, కసి ఎప్పుడూ చూడలేదు. 1994 తరువాతే ఇంత కసి చూశాను. ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలయ్యి డస్ట్ బిన్ లోకి పోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోయే రకం. అందుకు రాయలసీమ ఒక ఉదాహరణ. సీమలో 52 ఎమ్మెల్యేల్లో 49 మందిని వైసీపీ కాంగ్రెస్ అభ్యర్ధులను బెదిరించారు. ఈ కర్నూలు ఎంపీ ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్ గురించి ఆలోచించాడా? 5 ఏళ్ల్లల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదు.

నీళ్లు లేకుండా బాగా వెనకబడిన ప్రాంతం కర్నూలు, కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించారా? నేను రాయలసీమ బిడ్డే. రూ.68వేల కోట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. రాయలసీమకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. కాని జగన్ రూ.2వేల కోట్లు ఖఱ్చు చేశారు. జగన్ ను ఒడించేందుకు జనం సిద్ధం.

ఈ ముఖ్యమంత్రి ఫేక్ ఫెలో, ఎందుకు పనికిరాని దద్దమ్మ. హూ కిల్డ్ బాబాయ్? అని అడుగుతున్నాను. గొడ్డలి వేటు ఎవరిదో అర్ధమయ్యిందా? చంపిన వాళ్లకు ఎంపీ సీటు, చనిపోయిన బాధితులపై కేసులా? స్వయానా చెల్లినే ఇబ్బందులకు గురి చేశారు.

బీజేపీతో తాత్కాలిక ఒప్పందం అంటూ నాపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. టెక్నాలజీని తప్పుడు వార్తలకు చేరేస్తున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా మోసం చేసే మోసగాళ్లు వచ్చారు. రాయలసీమలో తాగడానికి మంచినీరు ఇవ్వలేని జగన్ ముద్ర ఎక్కడుంది? ఈ ప్రాంతానికి తట్ట మట్టి ఎత్తలేదు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నేడు నీళ్లు రాని పరిస్థితి.

ఈ ప్రాంతానికి తుంగభద్ర నీళ్లు తప్పా ఏ నీళ్లు రావు. హెచ్ హెల్ సీ, గుండ్రేవుల, గురురాంఘవేద్ర ప్రాజెక్టులు శరణ్యం. టీడీపీ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతే వైసీపీ వాటన్నింటిని నిర్వీర్యం చేశారు. పనులు లేకపోవడంతో ఈ ప్రాంతం నుంచి కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. నీటి వనరుల ప్రాజెక్టులను పూర్తి చేసి దశదిశ మారుస్తాను. డ్రిప్ ఇరిగేషన్ ను 90 శాతం సబ్సిడీకి రైతులు ఇచ్చాను. కాని నేడు వాటిని రద్దు చేశారు.

రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఓటు వేసినా మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది పేదలు, వెనకబడిన వర్గాల వారు ఉన్నారు. బోయ, కురబ, చేనేత, మాదిగ, మైనారిటీలు ఎక్కవు మంది ఉన్నారు. తెలుగుదేశం పేద వాళ్ల పక్షం. మీతోనే ఉంటాం. టీడీపీ డీఎన్ లోనే బీసీ ఉంది. బీసీల్లో గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ. మిమ్మల్ని ఆదరిస్తాం. మీకు మాకు ఉండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరు. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపిటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి పంచలిగాల నాగరాజును ఎంపీగా ప్రకటించాం.

మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి అనే బోయ కులస్థుడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించాం. ఆలూరులో ఒక లింగాయత్ కులానికి చెందిన వీరభద్ర గౌడ్ ను ప్రకటించాం. పత్తికొండలో ఈడిగ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి కుమారిడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించాం. బీజేపీ కూడా ఆదోని నుంచి బోయ వర్గానికి చెందిన పార్ధసారధి ఇచ్చాం. కర్నూలో వైశ్య, కొడుమూరులో మాదిగ వర్గానికి చెందిన ఎస్సీలకు ఇచ్చాం. ఇక ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డికి అభ్యర్ధిగా ఇచ్చాం. వారి కుటుంబం డీఎన్ ఏపీలో టీడీపీ ఉంది.

బుట్టా రేణుక పేద మహిళ అంటూ జగన్ రెడ్డి ప్రకటించారు. 2014లోనే ఆవిడ ఆస్తి రూ.250 కోట్లు. రామయ్య కూడా చాలా పేదవాడు అంటా? మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఇసుక, మట్టితో పాటు మంత్రాలయం దేవుడిని కూడా మింగేసిన వ్యక్తికి సీటు ప్రకటించారు. ఆదోనిలో వలసపక్షి ఉన్నారు. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లులోను వీళ్లు షాడోలుగా ఉంటారు. సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారు. 1983లో వాళ్ల నాన్న కూడా టీడీపీలోనే ఉండేవారు. యుద్ధాల్లో సామంత రాజును చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లుగా వీళ్లు ఇక్కడ నాయకులను ఆణగదొక్కి దోచుకుంటున్నారు. సామాజిక న్యాయం ఎవరిది?టీడీపీ వైసీపీదా?

ఆన్ లైన్ లో పించన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ చెప్పంది. ఓటు వేయలేని వారికి ఇంటి దగ్గరే పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటు వేయించుకుంటున్నారు. నా పేద వాళ్లు భయటకు రాలేరు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంక్ లో వేయకుండా, వాలంటీర్లతో కాకుండా వేరే వాళ్లను పెట్టి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

రెండు సార్లు ఎన్డీలో ఉన్నా ఏ ఒక్క ముస్లిం వ్యక్తి హక్కు భంగం కలగకుండా చూశాం. హైదరాబాద్, కర్నూలులో ఉర్దూయూనివర్సిటీలు పెట్టాం. ఉర్దూను రెండో భాషగా పెట్టాం. రంజాన్ తోఫాలు అందించాం. ముస్లింలకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్ట్టాం. దుల్హన్ పథకం ద్వారా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయించాం. దుకాన్, మకాన్ ద్వారా షాపులు ఇచ్చాం. మౌజన్, ఇమాంలకు గౌరవ వేతనం అందించాం. 5 ఏళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకు వైసీపీ సహకరించారు. కబుర్లతో దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతున్నారు. టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు కాపాడింది.

LEAVE A RESPONSE