Suryaa.co.in

Andhra Pradesh

అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి

-ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చారు
-బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి

-తెలుగుయువత, తెలుగునాడు డిమాండ్‌
-గుంటూరు ఎస్పీ తుషార్‌ డూండికి వినతిపత్రం

ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అవినీతికి బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షు డు మన్నవ వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు తెలుగుయువత నాయకులతో కలిసి సోమవారం గుంటూరు ఎస్పీ తుషార్‌ డూండికి వినతిపత్రం అందజేశారు. ముందుగా సాయికృష్ణ మాట్లాడుతూ 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి 2019లో జరిపిన ప్రిలిమ్స్‌, 2020లో జరిపిన మెయిన్స్‌ పరీక్షల డిజిటల్‌ మూల్యంకనం లో ఓఎంఆర్‌ షీట్లు మార్చి వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చి 169 పోస్టులు అమ్ముకుందని ఆరోపించారు.

ఇందులో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ డీజీపీ, అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌, ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర ముఖ్య సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిలపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జిల్లా టీఎన్‌ఎస్‌ ఎఫ్‌ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ మాట్లాడుతూ 42 వేల ఓఎంఆర్‌ షీట్లు మార్చి సంతలో పశువుల మాదిరిగా డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. 30 డిప్యూటీ కలెక్టర్‌, 25 డీఎస్పీ పోస్టులతో పాటు ఆర్డీవో, ఫారెస్ట్‌ ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, టీిఎన్‌ఎస్‌ఎఫ్‌ గుంటూరు తూర్పు పశ్చిమ అధ్యక్షుడు నరేంద్ర, కంచర్ల ధర్మతేజ, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తి కొండ కిరణ్‌ యాదవ్‌, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామకృష్ణ, శేషాద్రి సాంబశివరావు, పొత్తూరి వెంకటేశ్వరావు, నక్కా హేమంత్‌, విజయ్‌, భార్గవ్‌, యువత, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE