కేసీఆర్ కొత్త డ్రామా
కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ కు పాల్పడ్డారు
100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం
ధనిక రాష్ట్రం అప్పులపాలు
మంత్రి కొండా సురేఖ
వరంగల్ : కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారు. గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సహాయం చేయలేదు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం. ధనిక రాష్ట్రం అప్పులపాలైంది.
కవిత మద్యం కేసులో జైలులో ఉంది… కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ కు పాల్పడ్డారు. రైతులకు రాయితీలను ఎత్తివేసి… రైతు భీమా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫాంహౌస్ ను విడిచి వచ్చాడు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి.. రాష్ట్రంను అప్పులపాలు చేశారు.
రాబోయే పార్లమెంట్ లో ఎన్నికల్లో భారాసకు ఓటమి తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు భారాస పాలనలోనే దెబ్బతింది. దెబ్బతిన్న రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఇంజనీర్ కేసీఆర్. నిర్మాణ లోపంతోనే కాళేశ్వరం దెబ్బతింది. అధికారం కోల్పోవడం తో కేసీఆర్ కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు.
భారాస పార్టీ త్వరలో కనుమరుగవుతుంది. కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థలు అప్పులపాలైయ్యాయి. త్వరలో కేసీఆర్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాట తీరు మానుకోవాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు , కాంగ్రెస్ నాయకురాలు కడియం కావ్య పాల్గొన్నారు.