Suryaa.co.in

Andhra Pradesh

నేను స్ధానిక వ్యక్తినే.. విజయవాడ వాసినే

విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ సీటు లభించడం అదృష్టం
రాష్ట్రం కేంద్ర ఫలాలు అందిపుచ్చుకోవడం లేదు
కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి సుజనా చౌదరి

పదేళ్ల ఎన్‌డియే ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి యలమంచిలి సుజనా చౌదరి పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. మోదీ సమర్థ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని దేశవ్యాప్తంగా సామాన్యులు భావిస్తున్నారు. పేదల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. 20 కోట్ల మంది పేదలు దారిద్య్రరేఖ దిగువ నుంచి విముక్తి పొందారు.

పది కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించించాం. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం ద్వారా 4 కోట్ల ఇళ్లు పంపిణీ చేశాం. మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. జనౌషధి పథకం ద్వారా చౌకధరకు మందులు అందిస్తున్నాం. 78 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.10 వేల కోట్ల రుణ సదుపాయం అందచేత. రూ.46 వేల కోట్ల ముద్రా రుణాలు పంపిణి. 28 కోట్ల మందికి జీరో ఖాతాల ప్రారంభం.
ముస్లిం మహిళలకు ఆర్ధిక సహాయం, త్రిపుల్‌ తలాక్‌ రద్దుతో వైవాహిక భద్రత. మహిళలకు చట్టసభల్లో 33 రిజర్వేషన్‌ సౌకర్యం అమలు.

2014కు ముందు 55 శాతం ఉన్న గ్రామీణ రహదారులు 2024 నాటికి 90 శాతానికి చేరాయి. ఈ పదేళ్లలో 596 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 15 కోట్ల మందికి చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలొచ్చాయి. 77.6 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు పెరిగాయి. బడ్జెట్‌లో వ్యవసాయానికి 300 శాతం అధికంగా కేటాయింపులు. ఈ ఏడాది రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు.

13 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా 2.60 లక్షల కోట్లు ఆర్దిక సహాయం. తలసరి ఆదాయం 79 వేల నుంచి రూ.1,97,000 లకు పెరిగింది. అమెరికాతో పోలిస్తే 40 కోట్ల మందికి పెరిగింది. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. 2014లో 18 వేల కి.మీ.4 లైన్ల రహదారులుంటే ఇప్పుడు 40 వేల కి.మీ.లకు పెరిగింది. రహదారులకు 6 లక్షల కోట్లు కేటాయింపు.

2013`14లో 3 వేల కోట్లు కేటాయిస్తే నేడు 14 వేల కోట్లకు పెంపు. చిట్టచివరి పౌరుడికి సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధిలోకి తీసుకురవాలనేది భాజపా ప్రభుత్వ లక్ష్యం. కోవిద్‌ను భారత్‌ సమర్ధంగా ఎదుర్కోంది. నిత్యావసర వస్తువుల పంపిణీ నేటికి దేశవ్యాప్తంగా కొనసాగిస్తోంది. అయితే రాష్ట్రం కేంద్రం ఫలాలు అందిపుచ్చుకోవడం లేదు.

ఎపీలోను ఎన్‌డియేను ఆదరిస్తారు. రాబోయే అయిదేళ్లలో అభివృద్ధి సాధిస్తాం. విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ సీటు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. నేను స్ధానిక వ్యక్తినే. విజయవాడ వాసినే. నా ఇంటి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లేందుకు 20 నిమిషాలు చాలు.
పాత్రికేయుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి నేత లు కె.గణేష్,మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు

 

LEAVE A RESPONSE