శ్రీ రామ పూజిత అయోద్య అక్షంతల వితరణ చేసిన పురంధేశ్వరి

అరకు వాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీరామ శోభ యాత్రలో పాల్గొని, సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామ పూజిత అయోద్య అక్షంతల వితరణ చేశారు. ఈ ఆలయం లో దర్శనం చేసుకోవడం మహద్భాగ్యం గా భావిస్తున్నాను అన్నారు. త్రేతాయుగంలో యుగపురుషుడు శ్రీరామ చంద్రుడు అక్షింతలు నా చేతులు మీదుగా వితరణ చేయడం భగవంతుని ఆశీస్సులు గా భావిస్తున్నాను అన్నారు.

అరకు వాలీలోని కాఫీ మ్యూజియాన్ని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. కాఫీ తయారీ విధానం గూర్చి గైడ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.అరకు కాఫీ కీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదేవిధంగా అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు లేరు.ఇక్కడ కాఫీ తోటలు కారణం తో పాటు ఇక్కడ ప్రకృతి ప్రత్యేకతలు పర్యాటక అభివృద్ధి కి కీలకం గా చెప్పవచ్చు అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ద్వారా దర్శనీయ క్షేత్రాలు తో పాటు సందర్శన ప్రాంతాల ను అభివృద్ధి చేయడం జరుగుతోందని ఈ విషయాన్ని అనేక పర్యాయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన అంశాలను పురంధేశ్వరి ప్రస్తావించారు

Leave a Reply