మోదీ నూతన భారతాన్ని నిర్మించారు

– కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు హైదరాబాద్ జిల్లా నేతలు
-హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఆప్ నేత డా.హరిచరణ్ వారి అనుచరులు
-ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ స్టార్ అభినవ్ కేతావత్ (అభినవ్ సర్ధార్) వారి అనుచరులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. .దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉంది.దేశంలో మోదీకి పోటే లేదు. మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయం. దేశ ప్రజలంతా మోదీ మరోసారి అని కోరుకుంటున్నారు. మోదీ నేత్రత్వంలో దేశం అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం మౌలిక వసతులు కల్పన అద్భుతంగా జరిగింది.

మోదీ నూతన భారతాన్ని నిర్మించారు. దీంతో ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగింది.ఉగ్రవాదాన్ని కట్టడి చేశారు. పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందించారు.పొదుపు సంఘాలకు 20 లక్షలు రుణాలు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ప్రాంతీయ, కుటుంబ అవినీతి పార్టీలు ఫ్రంట్ పెట్టి పగటి కలలుకంటున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కాదు.. అవినీతి లేని స్థిరమైన మోదీ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు.మరోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వమే

Leave a Reply